వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 71

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 70 | పాత చర్చ 71 | పాత చర్చ 72

alt text=2020 జనవరి 3 - 2020 జనవరి 31 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2020 జనవరి 3 - 2020 జనవరి 31

వికీపీడియా అవగాహన మరియు ప్రాధమిక శిక్షణ సదస్సు[మార్చు]

వికీపీడియా అవగాహన మరియు ప్రాధమిక శిక్షణ సదస్సు నిర్వహిస్తున్నాం. ఇందులో తెలుగు వికీపీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహనా సదస్సును మరియు వికీపీడియాలో వ్యాసాలు రాసే కార్యక్రమానికి అవసరమైన మూలాల గురించి చర్చ నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులో పాల్గొనువారు వికీపీడియాకి తోడ్పడటమెలాగో నేర్చుకుని తద్వారా తెలుగులో కూడా అపూర్వ విజ్ఞాన సంపందని పోగేసే మహా ప్రయత్నంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నాం.

తేదీ :శనివారం జనవరి 4 2020న IIIT Hyderabad - Gachibowli
సమయం :ఉదయం 10 నుండి  మధ్యాహ్నం 1:00 వరకు
 స్థలం:  టీచింగ్ ల్యాబ్ 330  - ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గచ్చిబౌలీ , హైదరాబాద్  - 50003
Teaching Lab , Nilagiri Block  International Institute of Technology Gachibowli Hyderabad .

సంభాషించుటకు : 9959263974 / 9396533666 మీ రాకను తెలియచేయుటకు మాకు ఈ ఏమైనా క్రింది పద్దతులలో తెలియచేయండి మీ పేరుని , tewiki @ iiit.ac.in [[1]] కు మెయిల్ చేయండి లేదా వాట్సాప్ / ఎస్ యం ఎస్ : 9959263974 ఈ శుక్రవారం ( 03/01/2020) సాయంత్రం 4 గంటలకల్లా మీరు పాల్గొనడాన్ని ధృవీకరించండి. --2020-01-03T11:10:16(IST)‎ User:Dollyrajupslp

వికీపీడియా:వికీప్రాజెక్టు/అయోమయ నివృత్తి[మార్చు]

తెవికీ-16 సమావేశంలో వికీ సమస్యలపై చర్చించినపుడు వికీ నిర్వహణకు సంబంధించిన సమస్యలను వివిధ వాడుకరులు వెలుగు లోకి తెచ్చారు. వాటిలో అయోమయ నివృత్తి పేజీల సంస్కరణ ఒకటి. ఈ పని కోసం ఒక ప్రాజెక్టును రూపొందించాను. వికీపీడియా:వికీప్రాజెక్టు/అయోమయ నివృత్తి పేరుతో ఉన్న ఈ ప్రాజెక్టు వివరాలను పరిశీలించి, అ ప్రాజెక్టులో పాల్గొని వికీ నిర్వహణలో సహకరించాలని వాడుకరులందరినీ కోరుతున్నాను. పేరుకు నిర్వహణే అయినప్పటికీ, నిర్వాహకులు మాత్రమే కాకుండా అందరూ పాల్గొనవచ్చు. ప్రాజెక్టు ఉద్దేశాలను పరిశీలించి తగు సవరణలు, అవసరమైన చేర్పులూ చెయ్యవలసినది. __చదువరి (చర్చరచనలు) 05:47, 3 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అయోమయ నివృత్తి పేజీల సంస్కరణ తెవికీకి చాలా అవసరం. నేను కూడా ఇందులో సహకారం అందిస్తాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:08, 3 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల,మండలాల పునర్య్వస్థీకరణ జరిగినందున వాటికి చాలా మార్పులు చేయవలసిన అవసరముంది.అప్పుడు కొన్ని మార్పులు చేసిననూ అన్నిటిని చెక్ చేయవలసిన అవసరముంది.ఈ పనిలో నా తోడ్పాటు అందిస్తాను.--యర్రా రామారావు (చర్చ) 09:19, 3 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Toledo Information[మార్చు]

Hello everyone,

I had an opportunity to discuss the project in details with a few members of the community at various instances. For your facilitation, we have translated the information page to Telugu and the same can be found here- https://meta.wikimedia.org/wiki/Information_about_Google_Search_result_changes_due_to_Project_Toledo/te.\ Please go through the document and feel free to ask your questions and share your concerns and suggestions (if any) on the Talk Page. I'll be glad to assist you in any possible way for clarity on the project and to address your questions. I assure you that your feedback will be shared with the team and you will be informed about the status and actions at all the times.

Regards, Manav MKaur (WMF) (చర్చ) 06:56, 3 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆటోవికీబ్రౌజరు వాడుక[మార్చు]

గతంలో ఆటోవికీబ్రౌజరు (AWB) వాడుకరులకు అనుమతులు ఇచ్చే విధానం తెవికీలో లేదు. ఎవరైనా, ఒక్క దిద్దుబాటు కూడా చెయ్యని వాడుకరులైనా AWB ని వాడగలిగే వీలుండేది. అయితే ఇది AWB తో తక్కువ సమయంలో చాలా పెద్ద యెత్తున దుశ్చర్యలు చేసే అవకాశం ఉన్నందున, వికీవిధానాలు తెలిసిన వాడుకరులు మాత్రమే వాడాలి కాబట్టి సదరు వాడుకరులకు ముందస్తు అనుమతి ఉండాలనేది ఇతర వికీల్లో పాటిస్తున్న నియమం. తెవికీలో కూడా ఈ అనుమతి విధానాన్ని ప్రవేశపెట్టాను (నిర్వాహకులు, అధికారులకు ఈ అనుమతి అవసరం లేదు. అది AWB లో అంతర్గతంగా ఉన్న అంశం). ఈ పద్ధతిలో వికీపీడియా:AutoWikiBrowser/CheckPage పేజీలోని జాబితాలో ఉన్న వాడుకరులు మాత్రమే AWB ని వాడగలరు. ఈ పేజీని నిర్వాహకులు మాత్రమే దిద్దుబాటు చెయ్యగలిగేలా సంరక్షించాను (విధానానుసారం). ఈ పేజీలో ఉన్న ఏదైనా వాడుకరిపేరును తీసేస్తే అప్పటి వరకు AWB ని వాడిన ఆ వాడుకరి ఆ తరువాత వాడలేరు. గతంలో AWB ని వాడిన వాడుకరులు ఎవరో నాకు సరిగా తెలియనందున ప్రస్తుతం వారి పేర్లు ఈ పేజీలో చేర్చలేదు, దయతో మన్నించండి. ఆయా వాడుకరులు తమ పాత AWB వాడుకరిపేరును ఆ చర్చాపేజీలో రాస్తే ఆ వాడుకరి పేర్లను ఆ పేజీలో చేరుస్తాను. కొత్తగా AWB ని వాడదలచిన వాడుకరులు కూడా తమ అభ్యర్ధనను ఆ పేజీలో రాయాలి. నిర్వాహకులెవరైనా ఆ అభ్యర్ధనపై నిర్ణయం తీసుకుంటారు.

నిర్వాహకులకు: వికీపీడియా చర్చ:AutoWikiBrowser/CheckPage పేజీని పరిశీలిస్తూ, అభ్యర్ధనలేమైనా ఉంటే వాటిపై నిర్ణయం తీసుకోగలరు.

AWB వాడేందుకు అవసరమైన అర్హతలు - ప్రతిపాదన[మార్చు]

AWB ని వాడేందుకు అర్హతల విషయమై కింది ప్రతిపాదన చేస్తున్నాను. వాడుకరులు పరిశీలించి, తగు సూచనలు, సవరణలూ చేస్తే దీనిపై నిర్ణయం తీసుకుందాం.

  1. ప్రధాన పేరుబరిలో కనీసం 500 దిద్దుబాట్లు చేసి ఉండాలి.
  2. సదరు వాడుకరికి వికీవిధానాలపై తగు పరిజ్ఞానం ఉందని నిర్వాహకులు భావించాలి. (లేదని భావిస్తే తగు ఉదాహరణలు చూపించాలి)

__చదువరి (చర్చరచనలు) 10:27, 4 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మద్దతు, అంగీకారం[మార్చు]

  1. పై ప్రతిపాదనలకు నేను మద్దతు ఇస్తూ నా అంగీకారం తెలుపుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 13:40, 4 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ఈ ప్రతిపాదనకు నా మద్దతు, అంగీకారం. — వీవెన్ (చర్చ) 13:44, 4 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  3. ఈ ప్రతిపాదనకు నా మద్దతు తెలుపుతున్నాను. --కె.వెంకటరమణచర్చ 13:53, 4 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  4. మద్దతు -B.K.Viswanadh (చర్చ) 13:57, 4 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  5. పై ప్రతిపాదనలకు నేను మద్దతు తెలుపుతున్నాను. అయితే, ఆటోవికీబ్రౌజరు ఎడిట్లు చేయాలనుకున్నవారు ప్రస్తుతమున్న ఖాతా నుండి కాకుండా ఆటోవికీబ్రౌజరు కోసం మరో ఖాతా సృష్టించుకోవాలని గతంలో నిర్ణయం తీసుకున్నాం. Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:25, 4 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఇతర అభిప్రాయాలు[మార్చు]

  • AWB వాడుకపై నియంత్రణ మంచిదే. కాకపోతే క్రియాశీలత తక్కువగా వున్న మన వికీకి ఎక్కువ విధానాలు చేయడానికి బదులు తక్కువగా మరియు సులభంగా వుంటేనే వాటిని నిర్ధారించడం, అమలు చేయడం సులువు. నిర్వాహకులకు AWB హక్కు వుంటుంది కాబట్టి ప్రస్తుత ప్రతిపాదనలోగల వివరాల విషయంలో నిర్వాహకత్వం ఎన్నిక సందర్భంలో వాటిని పరిగణించడం జరుగుతుంది కాబట్టి, AWB వాడుక ప్రస్తుత నిర్వాహకులు, స్వచ్ఛందంగా విరమించిన నిర్వాహకులకు (కోరినట్లైతే)పరిమితం చేయడం మంచిది.--అర్జున (చర్చ) 23:02, 4 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • నాకు తెలిసినంతవరకు చెప్పాలంటే AWB ప్రారంభించిన తొలిదశలో నిర్వాహకులు మినహా మిగితా సభ్యులు దీన్ని వాడుటకు అవకాశం ఉండేది కాదు. నిర్వాహకేతర సభ్యులెవరైనా అభ్యర్థిస్తే వారికి AWB దిద్దుబాట్ల అవకాశం కల్పించాల్సి ఉంటుందనేది అప్పటి సూచన. కాని ప్రారంభంలో నలుగురైదుగురు నిర్వాహకులు మినహా ఎవ్వరూ దీన్ని అధికంగా ఉపయోగించలేరు. నిర్వాహకేతర సభ్యుల నుంచి ఎలాంటి అభ్యర్థనలు కూడా రాలేవు. క్రమక్రమంగా ఒకరిద్దరు మినహా నిర్వాహకులు కూడా దీన్ని ఉపయోగించడం మానివేశారు. నిర్వాహకేతరులు ఎలాంటి అనుమతి లేకుండా AWB ను ఉపయోగించుటకు ప్రస్తుతం అవకాశం ఉన్నాదా? అనే విషయం కూడా నాకు తెలియదు (ప్రారంభంలో మాత్రం లేకుండేది). ఒకవేళ అలా అవకాశం ఉన్నప్పుడు కొత్తసభ్యులను లేదా నియమాలు తెలియని వారికి ఈ అవకాశం దూరం చేయుటకు నియంత్రణ ఉండుట సమంజసమే. కాని ఓటింగు/మద్దతుకు ముందు అర్హతల విషయంలో ఇంకనూ మార్పు చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. చదువరి గారు కూడా "వాడుకరులు పరిశీలించి, తగు సూచనలు, సవరణలూ చేస్తే ..." అన్నారు కాబట్టి ఇప్పుడే మద్దతు తెల్పడం తొందరపాటు చర్యేనని భావిస్తూ అర్హతలకు సంబంధించి కొన్ని సవరణలు/మార్పులు చేర్పులకు ప్రతిపాదన చేస్తున్నాను.
    1) అభ్యర్థించే సభ్యుడికి వికీవిధానాలపై తగు పరిజ్ఞానం ఉందని నిర్వాహకులు భావించాలంటే వ్యాసేతర పేజీలపై చేసిన పని, చర్చాపేజీలలో అతని సూచనలు/అభిప్రాయాలపై దృష్టిసారించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రధాన పేరుబడిలో 500 దిద్దుబాట్లు బదులు వ్యాసేతర పేజీలలో దిద్దుబాట్ల సంఖ్యకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది
    2) "ప్రధాన పేరుబరిలో కనీసం 500..." అంటే తెవికీలోనేనా? లేదా అన్ని వికీలలో కలిపా? (లేదా తెలుగుకు సంబంధించి సోదర ప్రాజెక్టులు కూడా కలిపా?) అనేది స్పష్టంగా ఉండాలి (తెవికీలో చర్చ జరుగుతోంది/జరిగింది కాబట్టి తెవికీ దిద్దుబాట్లే అని సాధారణంగా అనుకుంటాం). సాధారణంగా కొత్త సభ్యులు AWB అభ్యర్థిన చేయరు, అసలు ఇలాంటిదొకటి ఉన్నట్లుగా కూడా కొత్తవారికి తెలిసే అవకాశం బహుతక్కువే. కొత్త సభ్యులు అభ్యర్థన చేశారంటే వారు తప్పనిసరిగా ఇతర వికీలలో అనుభవమున్నవారై ఉంటారు. ఇతర వికీలలో అనుభవం గడించి తెవికీలో ప్రధాన పేరుబడిలో 500 దిద్దుబాట్లు లేకుండా వికీల అభివృద్ధికి తోడ్పడుతున్న సభ్యుడికి AWB అవకాశం ఎందుకివ్వరాదనే విషయం కూడా మనం ఆలోచించాలి.
    3) వ్యాసేతర పేజీలలో వేలాది దిద్దుబాట్లతో తెవికీకి తోడ్పడి ప్రధాన పేరుబడిలో 500 దిద్దుబాట్లు కూడా లేని ఒక నైపుణ్యవంతుడైన సభ్యుడికి అవకాశం దూరం చేయలేముకదా! నేను తెవికీలో చేరిన ప్రారంభంలో అంటే పన్నేండేళ్లల క్రితం దేవా అనే సభ్యుడు వ్యాసంం పేజీలకంటే వ్యాసేతర పేజీల ద్వారానే నైపుణ్యం చూపించిన సంగతి అప్పటి సభ్యులకు గుర్తుండే ఉంటుంది.
    4) నిర్వాహకులకు అనుమతి అవసరం లేదు కాని నిర్వాహకులు AWBకై ప్రత్యేక సభ్యనామం సృష్టించుకుంటే వాటికి అనుమతి అవసరం. నిర్వాహకుడు అనే ఏకైక కారణంతో AWB హక్కులు ఇవ్వాలా? ఇప్పటివరకు నిర్వాహక ఓటింగులో AWB గురించి ఆలోచించలేము.
    5) నిర్వాహకేతరులెవరైనా AWB దిద్దుబాట్ల హక్కులకోసం కొరకు అభ్యర్థిస్తే అప్పుడు వారికి ఏ నిర్వాహకుడు/అధికారి అయినా హక్కులు ప్రసాదించవచ్చా? లేదా అభ్యర్థనపై చర్చ జరగాలా? ఆ విషయంలో తుదినిర్ణయం (అంటే సదరు సభ్యుడికి అర్హతలు ఉన్నాయనీ) ఎలా తీసుకోవాలి? 6) ఓటింగ్/మద్దతుకై రచ్చబండలో కాకుండా ఒక ప్రత్యేక పేజీ కేటాయిస్తే బాగుంటుంది (రచ్చబండలో లింకిస్తే సరిపోతుంది). సి. చంద్ర కాంత రావు- చర్చ 12:13, 5 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • నిర్వాహకేతరులు ఎలాంటి అనుమతి లేకుండా AWB ను ఉపయోగించే అవకాశం గతంలో ఉండేది. నేను చేసిన మార్పు కారణంగా ఇప్పుడు అది కుదరదు. చంద్రకాంతరావు గారూ అర్హతల విషయంలో నేను సూచించినవి కేవలం చర్చ ప్రారంభం కోసం మాత్రమే (నేను మొదలు పెట్టే చర్చల్లో అలాగే చేస్తూంటాను). సముదాయం ఎలా నిర్ణయిస్తే అలానే చేద్దాం. వ్యాసేతర పేజీల్లో అనుభవం ఉండాలనే చంద్రకాంతరావు గారి అభిప్రాయాన్ని సమర్ధిస్తూ, ప్రధాన పేరుబరితో పాటు దీన్ని కూడా పరిగణించాలని అభిప్రాయపడుతున్నాను. "తెవికీలోనేనా?" - తెవికీలోనే. "నిర్వాహకుడు అనే ఏకైక కారణంతో AWB హక్కులు ఇవ్వాలా?" -అది AWB లో అంతర్గతంగానే ఉంది. "ఓటింగ్/మద్దతుకై రచ్చబండలో కాకుండా ఒక ప్రత్యేక పేజీ కేటాయిస్తే బాగుంటుంది" - ఈ విషయంపై నేను ఒకడుగు వెనక్కి తగ్గదలచాను (అభిప్రాయం చెప్పడంలో కాదు సుమండీ). మరో నిర్వాహకులు ఎవరైనా ఈ పేజీ తెరిచి, చర్చను మొదలుపెట్టి, అభిప్రాయాలను ప్రోది చేసి, విధానాన్ని రూపొందించాలని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 14:45, 6 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఆటో వికీ బ్రౌజరుపై ఇప్పటివరకు జరిగిన అభిప్రాయాలు,చర్చల ప్రకారం ఆటోవికీ బ్రౌజరు వాడదామని అనుకునే కొత్త వాళ్లకు ఎవరికైనా కోరి కష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి అనే అభిప్రాయం కలుగుతుంది.అయినా అలా అనుకంటే ఏపనిలో మనం ముందుకు వెళ్లలేం.కష్టాలు తరువాత అంతా సుఖమే.దీనిని చదువరి గారి లాగా అవసరమైన చోట్ల తరుచూ ఉపయోగిస్తూ ఉంటేనే దాని ప్రయోజన ఫలితాలు ఉంటాయని నేను భావిస్తున్నాను.కొత్తగా వాడేవార్కి వికీపీడియా:AutoWikiBrowser/User manual పేజీ కొంతవరకు మాత్రమే తెలుగులో అనువదించబడింది.పూర్తి పేజీని తెలుగు వికీపీడియాకు అనుగుణంగా అనువదించి అందుబాటులో ఉండాలని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 08:14, 8 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • చంద్రకాంతరావు గారూ, "ఓటింగ్/మద్దతుకై రచ్చబండలో కాకుండా ఒక ప్రత్యేక పేజీ కేటాయిస్తే బాగుంటుంది" అనే మీ సూచనకు స్పందిస్తూ కొత్త పేజీని ఎవరూ మొదలుపెట్టలేదు. సూచన చేసిన మీరైనా ముందుకు వచ్చి ఈ పనికి శ్రీకారం చూట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 07:58, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

AWB ఖాతా పై చర్చ[మార్చు]

AWB మార్పుల వల్ల ఇటీవలి మార్పులు పరిశీలించేవారికి కాస్త ఇబ్బందిగా ఉండేది కాబట్టి AWBని అధికంగా ఉపయోగించేవారు బాటు ఖాతా ప్రారంభించుకోవాలనే సూచన మాత్రం నాకు గుర్తుంది. AWB పై నియమాలు రూపొందించినట్లుగా నాకు తెలియదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:23, 5 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మన్నించాలి చదువరి గారు... ఆటోవికీబ్రౌజరు కోసం మరో ఖాతా సృష్టించుకోవాలని గతంలో నిర్ణయం తీసుకున్నాం అని నేను ఈ చర్చలో ప్రస్తావించాను. సి. చంద్ర కాంత రావు గారు చెప్పినట్టుగా... అలాంటి నిర్ణయమేమి జరగలేదు. ఆటో వికీబ్రౌసర్ ను ఉపయోగించేవారు వేరే ఖాతాను తెరవడం మంచిదని నా అభిప్రాయం అనేది మాత్రమే గతంలో ఆటో వికీ బ్రౌజర్ (AWB) వాడకం-సభ్యనామం మార్పు అనేదానిపై జరిగిన చర్చలో సూచనగా అక్కడ ప్రస్తావించాను. ఆటోవికీబ్రౌజరు వాడుకపై సరైన నియమాలు ఉంటేనే మంచిదని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 10:15, 6 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Pranayraj Vangari గారూ, "ఆటోవికీబ్రౌజరు వాడుకపై సరైన నియమాలు ఉంటేనే మంచిదని నా అభిప్రాయం." - నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ఇది చాలా శక్తిమంతమైన పరికరం. ఎంత ఉపయోగమో, సరిగ్గా వాడకపోతే అంతే చేటు చెయ్యగలదు కూడా. __చదువరి (చర్చరచనలు) 14:30, 6 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇప్పుడు ఉన్న నిబంధనలు అలా ఉంచి మరో అదనపు నిబంధనగా ఏడబ్ల్యుబి వాడాలంటే ప్రత్యేక ఖాతా ఉండాలన్న నియమం పెట్టాలని భావిస్తున్నాను. ఇప్పటికే చదువరి గారు (వాడుకరి:ChaduvariAWBNew), వెంకటరమణ గారు (వాడుకరి:K.Venkataramana.AWB), చంద్రకాంతరావు గారు (వాడుకరి:C.Chandra Kanth Rao AWB) ఏడబ్ల్యుబి కోసం ప్రత్యేక ఖాతాలు సృష్టించుకున్నారు. వీరిలో చదువరి గారి ఏడబ్ల్యుబి ఖాతా చాలా చురుకుగా ఉంది. దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే- నేనూ చంద్రకాంతరావు గారిలానే నిర్వాహకుడు అన్న ఏకైక కారణంతో ఎవరికైనా చర్చ లేకుండా ఏడబ్ల్యుబి నడిపించే అధికారం ఉండాలని అనుకోవట్లేదు. ఎందుకంటే, నిర్వాహకులు స్వతఃసిద్ధంగా ఏడబ్ల్యుబి వాడకంలో జరగగల తప్పొప్పులకు అతీతులు కానక్కరలేదు. కాబట్టి, ప్రతీ వాడుకరి ఏడబ్ల్యుబి నడపడానికి కొత్త ఖాతా సృష్టించుకోవాలి అన్నప్పుడు అనివార్యంగా, ఆ కొత్త ఖాతా నడిపేవారు నిర్వాహకులైనా కాకపోయినా ఏడబ్ల్యుబి నడపడానికి తప్పనిసరిగా అనుమతి అడగాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఏడబ్ల్యుబి కోసం ప్రత్యేకించి ఖాతాను వారి వాడుకరి పేరు తర్వాత బ్రాకెట్లో ఏడబ్ల్యుబి పెట్టి ఏర్పాటుచేసుకున్నాకా, ఆ కొత్త ఖాతా వాడుకరి పేజీని దాన్ని నడిపే వాడుకరి తన ప్రాథమిక వాడుకరి ఖాతా నుంచి రూపొందించాలి. (ఎందుకంటే- తుంటరిగా ఒకరు మరొకరి పేరిట ఏడబ్ల్యుబి ఖాతాలు తయారుచేసి, వారు అచేతనంగా ఉన్న కాలంలో నడిపి గందరగోళం సృష్టించే అవకాశాన్ని పరిహరించడానికి) ఆపైన, ఏడబ్ల్యుబిలో ఏయే మార్పులు చేయదలిచారో సముదాయంలో వివరించి, ఆమోదం పొందాలి. ఆ ప్రకారం మార్పుచేర్పులు ఆ ఏడబ్ల్యుబి ఖాతా వాడి చేయాలి. ఇదీ నా ప్రతిపాదన. --పవన్ సంతోష్ (చర్చ) 17:42, 6 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
దేనికైనా మార్గదర్శకాలు, విధాన నిర్ణయాలు ఉంటేనే అది సజావుగా అమలుజరుగుతుందనేది వాస్తవం.ప్రత్యేక ఖాతా ద్వారా అటో వికీ బ్రౌజరు వాడేందుకు, దీని ద్వారా చేయబోయే మార్పులు రచ్చబండ దృష్టికి తీసుకువచ్చేందుకు నేను స్వాగతిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:19, 8 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారి AWB ఖాతా అభ్యర్ధన[మార్చు]

యర్రా రామారావు గారు స్వచ్ఛందంగా ఒక కొత్త వాడుకరి పేరుతో AWB వాడేందుకు ముందుకు వచ్చారు. వికీపీడియా చర్చ:AutoWikiBrowser/CheckPage‎‎ పేజీలో ఆ వాడుకరికి అనుమతి ఇవ్వమని కోరారు. నిర్వాహకులెవరైనా ఆయనకు అనుమతి ఇవ్వాలి. ప్రస్తుతం వికీలో చురుగ్గా ఉన్న నిర్వాహకుల్లో ఒకరైన ఆయన తనకు తానే ఈ అనుమతి ఇచ్చుకోలేరు. నేను ఇవ్వకూడదని కాదుగానీ, ఈ ప్రతిపాదన చేసాను కాబట్టి వేరెవరైనా ఇస్తే బాగుంటుందని భావిస్తున్నాను. ప్రస్తుతం చురుగ్గా ఉన్న ఇతర నిర్వాహకులు - రవిచంద్ర, అర్జునరావు, ప్రణయ్‌రాజ్, పవన్ సంతోష్, సుజాత, వెంకటరమణ, విశ్వనాధ్, చంద్రకాంతరావు మొదలైన వారిలో ఎవరో ఒకరు ఆయనకు అనుమతి ఇవ్వమని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 07:58, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

  • చదువరి గారికి, పై చర్చ కొలిక్కి రాకుండానే, బాట్ ఖాతా అభ్యర్ధన పై నిర్ణయం తీసుకోవడం సబబనిపించుటలేదు. యర్రా రామారావు గారు వారి సాధారణ ఖాతా లేక బాట్ ఖాతాతో AWB సవరణలు నాకు కనిపించలేదు. కొద్దిగా AWB సవరణలు చేస్తే దాని పై స్పందనలు చూసిన తరువాత మరియు పై చర్చ పై నిర్ణయం తీసుకున్న తరువాత బాట్ ఖాతాకు బాట్ ఫ్లాగ్ ఇవ్వటం బాగుంటుందనుకుంటాను. --అర్జున (చర్చ) 05:44, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • గతంలో నేను కూడా AWB ఉపయోగించి తెలంగాణ గ్రామవ్యాసాల్లోని రాష్ట్రం విభాగంలో ఆంధ్ర ప్రదేశ్ స్థానంలో తెలంగాణను చేర్చాను. యర్రా రామారావు గారు అనేక వ్యాసాలలో ఉన్న చిన్నచిన్న మార్పులను AWB ద్వారా చేయాలని ముందుకువచ్చారు. వారు AWB ఖాతా సృష్టించుకోవడం నాకు అంగీకారమే.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 15:33, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • అర్జున గారూ, చెట్టు ముందా, విత్తు ముందా అన్నట్టు అయింది పరిస్థితి. అనుమతి ఇవ్వనిదే AWB వాడలేరు. వాడితే తప్ప సవరణలు ఎలా ఉంటాయో తెలీదు. యర్రా రామారావు గారు నిర్వాహకులు కాబట్టి తన మామూలు ఖాతాతోనే AWB వాడగలరు. నిర్వాహకేతరుల పరిస్థితి ఏంటి? అనేది ఆలోచించాలి. అభ్యర్ధించిన వారు తమ మామూలు ఖాతాతో ఇప్పటివరకు చేసిన దిద్దుబాట్ల పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని నా అభిప్రాయం. ఇకపోతే, ఆయన అడిగింది బాట్ ప్లాగు కాదు. ఇక, పై చర్చపై నిర్ణయం.. సరే అలాగే కానివ్వండి. ఇక్కడే నిర్ణయం తీసుకుందామా లేక ప్రత్యేఖంగా పేజీ పెట్టి అక్కడ నిర్ణయం తీసుకుందామా అనేది పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 06:05, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • చదువరి గారికి, నేను పైన AWB ఖాతా అని రాయవలసింది బాట్ ఖాతా అని రాశాను. క్షమించండి. నేను AWB వాడుకరిని కాను. ప్రస్తుతం యర్రా రామారావు గారు తన సాధారణ ఖాతాతో కొద్ది మార్పులు చేసిన పిదప AWB వాడుతున్న ఇతర నిర్వాహకులు అభ్యర్ధన పై స్పందించమని కోరుతున్నాను. అలాగే పై చర్చని ముందుకు తీసుకువెళ్లడానికి, AWB వాడుతున్న లేక వాడిన నిర్వాహకులు స్పందించాలని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 06:37, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • అర్జున గారూ, ఇప్పుడు యర్రా రామారావు గారు ఏం చెయ్యాలని మీరు చెబుతున్నారో నాకు అర్థం కాలేదు. "సాధారణ ఖాతాతో కొద్ది మార్పులు చేసిన పిదప " అని అంటున్నారు. AWB అనుమతి ఇవ్వనిదే ఎలా చేస్తారు? ఆయన నిర్వాహకుడైనందున అనుమతి లేకున్నా దిద్దుబాట్లు చేసే సౌకర్యం ఉంది. మరి, ఆయన నిర్వాహకుడు కాకపోతే మీరు ఏం అడిగి ఉండేవారు? లేదా, నిర్వాహకుడు కాని మరో వాడుకరి AWB అనుమతి కోరితే ఏం అడిగి ఉండేవారు?__చదువరి (చర్చరచనలు) 17:02, 15 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • చదువరి గారికి, ప్రస్తుత అభ్యర్ధనకి సంబంధించే నా సమాధానం ఇచ్చాను. తెవికీలో నాకు తెలిసి నిర్వాహకుడు కాని వ్యక్తి AWB ఖాతా కోరటం ఇప్పటికి జరగలేదు, ఇకముందు జరిగే అవకాశం నా దృష్టిలో తక్కువ. అందుకనే AWB ఖాతా గురించి పై విభాగాలలో మీ ప్రతిపాదనకు నా స్పందన వుంది. కాని దానికి ఎవరూ స్పందించనేలేదు.--అర్జున (చర్చ) 04:21, 16 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • అర్జున గారూ, "తెవికీలో నాకు తెలిసి నిర్వాహకుడు కాని వ్యక్తి AWB ఖాతా కోరటం ఇప్పటికి జరగలేదు,.." - తప్పు, ఇంతకుముందు నిర్వాహకేతరులు వాడారు. "ఇకముందు జరిగే అవకాశం నా దృష్టిలో తక్కువ." సరే మీ అభిప్రాయమే సరియని అనుకుందాం.. తక్కువే గానీ అసలు లేదని కాదు గదా! నిర్వాహకేతరులు అడిగితే అప్పుడు ఏం చేస్తారు?__చదువరి (చర్చరచనలు) 05:06, 16 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • చదువరి గారికి, అప్పుడు అందరికి అనుమతి వుంది కాబట్టి, శిక్షణ తరగతులలోనో ఇతరత్రానో వాడి వుండవచ్చు. తెవికీ ప్రస్తుత స్థితిలో ప్రాధాన్యతలపై దృష్టిపెట్టటం మంచిది. అంతగా ఎవరైనా కోరితే, వారిని నిర్వాహకత్వానికి అభ్యర్ధించమని చెపితే నా దృష్టిలో సరిపోతుంది. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 05:10, 16 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఓహో, AWB వాడుకరి అనుమతి కావాలంటే నిర్వాహకత్వ అనుమతి పొందాలన్నమాట! అనుమతి అడిగిన వారందరికీ నిర్వాహకత్వం ఇచ్చే విషయం పరిశీలిస్తారన్నమాట! లాజిక్కు చిత్రంగా ఉంది అర్జున గారూ! 786 దిద్దుబాట్లు శిక్షణ తరగతులలో చేసినట్లన్నమాట! మీ వాదనను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి సార్. నమస్కారం. మిగతా వాడుకరులందరికీ ఒక విన్నపం.. అర్జున గారి లాజిక్కు సరిగ్గా ఉన్నట్టు అనిపించడం లేదు నాకు. ఒక మార్గం ఏమిటంటే, అనుమతి కోరిన వాడుకరులకు తాత్కాలికంగా ఒక 50 దిద్దుబాట్ల వరకూ చేసేందుకు అనుమతించి వారి పనితీరు చూసాక దాన్ని కొనసాగించడమో అనుమతి తిరస్కరించడమో చెయ్యవచ్చని నా ఆలోచన. పరిశీలించవలసినది. __చదువరి (చర్చరచనలు) 05:42, 16 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
AWB వాడుకరి అనుమతి కావాలంటే వాడుకరి తప్పనిసరిగా నిర్వాహకత్వం కోసం అభ్యర్థించడం సరికాదని నా అభిప్రాయం. నిర్వాహకులకు AWB వాడే సౌలభ్యం ఎలానూ ఉంటుంది. నిర్వాహకులు కాని అనుభవజ్ఞులైన వాడుకరులు AWB ని కోరినప్పుడు వారు ఇదివరకు చేసే వ్యాస, వ్యాసేతర దిద్దుబాట్లు పరశీలించి (ఇది వరకు లక్షల దిద్దుబాట్లు చేసిన వారు కూడా అనేక దోషాలను చేసారు) వారికి తాత్కాలికంగా అనుమతించి చదువరి గారు చెప్పినట్లు 50 దిద్దుబాట్ల వరకు పరిశీలించి పనితీరు చూసాక వారిని కొనసాగించడమో, తిరస్కరించడమో చేయాలని నా అభిప్రాయం.--కె.వెంకటరమణచర్చ 06:00, 16 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు కూడా వాడుకరి:K.Venkataramana.AWB పేరుతో AWB వాడుకరి పేజీ ఉంది. దానికి కూడా మీరు అనుమతివ్వాలి.--కె.వెంకటరమణచర్చ 06:05, 16 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారూ, అయింది. ఒకసారి లాగినై చూడండి. __చదువరి (చర్చరచనలు) 01:03, 17 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

AWB అనుమతి కోరిన వాడుకరులకు తాత్కాలిక అనుమతి ఇచ్చి, వారి పనితీరును బట్టి తదుపరి నిర్ణయం తీసుకునే ప్రతిపాదనను ఒకరు సమర్ధించారు. వ్యతిరేకత ఏమీ రాలేదు. కాబట్టి ఆ పద్ధతి ఖాయం చేసుకుందామని నిర్ణయిస్తున్నాను. పోతే, యర్రా రామారావు గారికి తాత్కాలిక అనుమతి ఇవ్వమని తోటి నిర్వాహకులను కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 00:57, 21 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు చదువరి గారు... యర్రా రామారావు గారికి నేను తాత్కాలిక అనుమతి ఇచ్చాను. రామారావు గారు, ఒకసారి లాగినై చూడండి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 09:33, 22 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Yarra RamaraoAWB అనే ఖాతా ద్వారా సవరణలు చేపట్టుటకు పాటించవలసిన సూచనలు,జాగ్రత్తలు తెలిపిన చదువరి గార్కి, అలాగే తాత్కాలిక అనుమతి ఇచ్చినందుకు Pranayraj Vangari గార్కి, ఇతర సముదాయం సభ్యులందరికి ముంధుగా ధన్యవాదాలు.వాడుకరి:Yarra RamaraoAWB అనే ప్రత్యేక ఖాతా ద్వారా వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు వర్గంలోని గ్రామాలు ఆంధ్ర ప్రదేశ్.. ను ఆంధ్రప్రదేశ్.. అని మార్చాలని ప్రతిపాదన అనుసరించి వర్గం:ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు అనే వర్గంలోకి సుమారు 100 సవరణలు పైగా చేపట్టాను.గౌరవ నిర్వహకులు ఎవరైనా పరిశీలించి వాడుకరి:Yarra RamaraoAWB అనే నా ఖాతా ను శాశ్వత ఖాతాగా గుర్తించగలందులకు కోరుచున్నాను--యర్రా రామారావు (చర్చ) 06:29, 26 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Yarra RamaraoAWB అనే ప్రత్యేక ఖాతా ద్వారా రామారావు గారు చేసిన మార్పులను చూశాను. అవి సరిగానే మార్పులు చేయబడ్డాయి. తెవికీ అభివృద్ధికోసం అవసరైన మార్పులు ఇకముందు ఈ ఖాతా ద్వారా చేయబడుతాయనడంలో ఎటివంటి సందేహాలు లేవు కాబట్టి, ఈ ఖాతాను శాశ్వత ఖాతాగా గుర్తించడమైనది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:58, 28 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Pranayraj గారూ ధన్యవాదాలు--యర్రా రామారావు (చర్చ) 18:43, 28 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Wikimedia Movement Strategy: 2020 Community Conversations[మార్చు]

Dear Wikimedians,

Greetings! Wishing you a very happy new year!

We have an update for the next steps of the Movement Strategy! We're preparing for a final round of community conversations with Wikimedia affiliates and online communities around a synthesized set of draft recommendations to start around late/mid January. In the meantime, recommendations’ writers and strategy team has been working on integrating community ideas and feedback into these recommendations. Thank you, for all of your contributions!

What's New?[మార్చు]

The recommendations writers have been working to consolidate the 89 recommendations produced by the working groups. They met in Berlin a few weeks back for an in-person session to produce a synthesized recommendations document which will be shared for public comment around late/mid January. A number of common areas for change were reflected in the recommendations, and the writers assessed and clustered them around these areas. The goal was to outline the overall direction of the change and present one set that is clearly understood, implementable and demonstrates the reasoning behind each.

What's Next?[మార్చు]

We will be reaching out to you to help engage your affiliate in discussing this new synthesized version. Your input in helping us refine and advance key ideas will be invaluable, and we are looking forward to engaging with you for a period of thirty days from late/mid January. Our final consultation round is to give communities a chance to "review and discuss" the draft recommendations, highlighting areas of support and concern as well as indicating how your community would be affected.

Please share ideas on how you would like to meet and discuss the final draft recommendations when they are released near Mid January whether through your strategy salons, joining us at global and regional events, joining online conversations, or sending in notes from affiliate discussions. We couldn't do this without you, and hope that you will enjoy seeing your input reflected in the next draft and final recommendations. This will be an opportunity for the movement to review and respond to the recommendations before they are finalized.

If possible, we'd love if you could feature a discussion of the draft recommendations at the next in-person meeting of your affiliate, ideally between the last week of January and the first week of February. If not, please let us know how we can help support you with online conversations and discussing how the draft recommendations fit with the ideas shared at your strategy salon (when applicable).

The input communities have shared so far has been carefully documented, analyzed, and folded into the synthesized draft recommendations. Communities will be able to see footnotes referencing community ideas. What they share again in January/February will be given the same care, seriousness, and transparency.

This final round of community feedback will be presented to the Board of Trustees alongside the final recommendations that will be shared at the Wikimedia Summit.

Warmly -- User:RSharma (WMF) 15:58, 4 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకులు, సీనియర్లు చర్చల్లో పాల్గొనక పోతే ఎలా?[మార్చు]

ప్రస్తుతం వికీలో చురుగ్గా ఉంటూ కూడా కొందరు వాడుకరులు, ముఖ్యంగా నిర్వాహకులు ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో పాల్గొనడం లేదు. నిర్వాహక పనులు కొన్ని పెండింగులో ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోవడం లేదు. చర్చల్లో పాల్గొని అభిప్రాయాలు చెప్పాలని, తొలగింపు పనుల్లో దృష్టి పెట్టాలనీ అభ్యర్ధిస్తున్నాను.__చదువరి (చర్చరచనలు) 09:02, 5 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

రచ్చబండలో ప్రవేశపెట్టిన ప్రతి చర్చలో ఇక్కడనుండి సక్రమంగా పాల్గొంటాను.--యర్రా రామారావు (చర్చ) 09:08, 7 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అభిప్రాయాలు[మార్చు]

ప్రస్తుత చర్చలు జరుగుచున్న తీరు చూస్తుంటే ఇద్దరు ముగ్గురికి మాత్రమే పాల్గొనుచున్నట్లు అనిపిస్తుంది.ఈ జాబితా ప్రకారం నిర్వాహకులు 14 మంది ఉన్నాం. కారణాలు ఏమైతేనేమి నేను నిర్వాహకునిగా ఎంపికైన తరువాత గమనించినదాని ప్రకారం కొద్ది మంది క్రమంగా, కొద్ది మంది అప్పుడప్పుడు పొల్గొంటుండగా, ఇంకొంత మంది ఇంతవరకు పాల్గొనిన సందర్బాలు లేనట్లుగా తెలుస్తుంది.చర్చలలో సరియైన నిర్ణయాలు జరగాలంటే ఎక్కువమంది పాల్గొంటేనే దాని ఫలితం ఉంటుందనేది అందరికి తెలిసిన వాస్తవమే. ప్రతి మూడు చర్చలకు కనీసం రెండు చర్చలలోనైనా పాల్గొనాలి అనే నియమం మనందరం పాటిస్తే బాగుంటుందని నా స్వంత అభిప్రాయం.చర్చను ప్రవేశపెట్టిన వ్వక్తి అందరి నిర్వాహకులకు 'పింగ్' చేసే సాంప్రదాయం పాటిస్తే అప్పడైనా పనుల వత్తిడిలో గుర్తు పెట్టుకుని పాల్గొంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా చురుకైన వాడుకరులను గమనించి అటువంటి వార్కి ఇదే పద్దతి పాటించవచ్చు.వికీపీడియా:2020 వికీమీడియా జాతీయ సమావేశం ప్రతిపాదన చర్చలో 18 మంది పాల్గొన్నారు.దీనిని బట్టి మిగతా చర్చలుకు అంత విలువ లేదని అర్దం చేసుకోవాలా? అని నాకనిపిస్తుంది.--యర్రా రామారావు (చర్చ) 09:08, 7 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నావరకూ సిస్టం, లాప్ టాప్ దగ్గరలో లేక పాల్గొనలేకపోతున్నాను. ముబైల్ మీద వికీలో నాకు టైపింగ్ ఇబ్బందిగా ఉంటుంది. అన్నీ చూస్తాను కాని స్పందించలేకపోతున్నాను. ఆలస్యమైనా అవసరమైన సంధర్భాల్లో పాల్గొంటూనే ఉంటాను..B.K.Viswanadh (చర్చ) 12:06, 7 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Project Tiger 2.0 - last date of the contest[మార్చు]

Excuse us for writing in English, kindly translate the message if possible

Greetings from CIS-A2K!

tiger face
tiger face

It has been 86 days since Project Tiger 2.0 article writing contest started and all 15 communities have been performing extremely well, beyond the expectations. 

The 3-month contest will come to an end on 11 January 2020 at 11.59 PM IST. We thank all the Wikipedians who have been contributing tirelessly since the last 2 months and wish you continue the same in these last 5 days!

Thanks for your attention
using --MediaWiki message delivery (చర్చ) 13:35, 6 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

InternetArchiveBot(IABot) తెవికీ కొరకు చేతనం[మార్చు]

IABot చిహ్నం

InternetArchiveBot(IABot) పరీక్షల తర్వాత అమరికలు సవరించబడి తెలుగు వికీపీడియాలో చేతనమైందని తెలుపుటకు సంతోషించుచున్నాను. దీనిని నడుపుటకు లింకు వాడండి. మరిన్ని వివరాలకు IABot నడుపుటకు వాడు పద్ధతి చూడండి. పాత చర్చలకొరకు వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_69#InternetArchiveBot_తొలిమార్పులపై_సమీక్ష, వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_67#InternetArchiveBot_కొరకు_బాట్_ఫ్లాగ్_అభ్యర్ధన చూడండి. అందరూ ఉపయోగించి సమస్యలు, సూచనలు ఏవైనా తెలియచేయండి. ఈ పని వేగవంతంగా చేయాలని నేను ఎంత ఆశించినా బాటు యజమాని స్పందనలలో ఆలస్యం అయినందుకు క్షమాపణలు. ఈ బాట్ పరీక్షలో సహకరించిన వాడుకరి:Chaduvari కి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 07:23, 7 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

  1. ముందు "Add archives to all non-dead references (Optional)" ను ఎందుకోకుండా నడిపాను. 11 లింకులను సవరించింది. సవరించిన లింకుల్లో ఒకదాన్ని చెక్ చేసాను. ముందున్న ఆర్కైవు లింకు ద్వారా అసలు పేజీ కాకుండా ఆ వెబ్‌సైటు హోం పేజీ కనబడింది. తరువాతి లింకులో అసలు పేజీకి లింకు వెళ్ళింది. checkY
  2. రెండోసారి "Add archives to all non-dead references (Optional)" ను ఎంచుకుని అదే పేజీ మీద నడిపాను. ఈ సారి అది 29 లింకులను కొత్తగా ఆర్కైవు చేసింది. వీటిలో రెండు లింకులను చెక్ చేసాను, రెండూ checkY
  • స్పందించిన సభ్యులందరికి ధన్యవాదాలు. నేను గత (డిసెంబర్ 2019) నెలలో ఎక్కువ వీక్షణలు పొందిన 975పేజీలపై నడిపాను. 285 పేజీలలో అంటే 30శాతం పేజీలలో మార్పులు చేసింది. మొత్తంమీద 11376 లింకులు విశ్లేషించి 1430 లింకులను ఆర్కైవ్ లింకులు జోడించింది. అంటే 12.5 శాతం లింకులను కాపాడింది. అంతేకాకుండా దానంతటదే అన్ని పేజీలను తనిఖీ చేస్తున్నట్లు కానవచ్చింది. ప్రస్తుతానికి గ అక్షరంతో ప్రారంభమయ్యే పేజీలలో పనిచేస్తున్నది. వాటిలో కొన్ని సవరణలు చూస్తే, జనగణన population finder పేజీలను ఆర్కైవ్ చేసినట్లు కనిపించింది. వీటివలన పెద్ద ఉపయోగం లేదు. కొన్ని రోజులు వాడుతుంటే కాని మరింతగా అర్థం కాదు. అప్పుడు మనకు ఆర్కైవ్ చేయనవసరంలేని లింకులు వివరాలు అమరికలో పొందుపరచవచ్చు. మీ దృష్టికి వచ్చిన ఇతర విషయాలు కూడా తెలియచేయండి.--అర్జున (చర్చ) 13:04, 7 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • Pranayraj Vangari గారికి, నేను క్రిందటి వ్యాఖ్యలో తెలిపినట్లు ఎక్కువమొత్తంలో వ్యాసాలపై దీనిని నడపవచ్చు. అయితే ఇప్పటికే తెలుగు వికీలో ప్రధాన పేరుబరిలో అన్ని వ్యాసాలను తనిఖీ చేసి 17000 పైగా వ్యాసాలలో వీలైన చోట్ల లింకులు చేర్చడం పూర్తిచేసి, నిన్న మొన్నలో కొత్తగా చేర్చబడిన వ్యాసాలను, బాట్ పరిశీలన తర్వాత మార్పులు చెందిన వ్యాసాలను తనిఖీచేయడం, లేక ఇంతకుముందు నడిపినప్పుడు లింకులు పనిచేయడం నిర్ధారించడం పూర్తికాకపోతే మరల నిర్ధారించడం కొరకు పని కొనసాగిస్తున్నది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియలాగా వున్నది. కావున మనకు ప్రత్యేకంగా అవసరమైతే, అనగా పనిచేస్తున్న లింకులకు కూడా ఆర్కైవ్ లింకులు చేర్చాలనుకుంటే తప్ప, లేక వేరే పేరుబరిలోని వ్యాసాల పై పనిచేయించాలనుకుంటే తప్ప, మనం వ్యక్తిగతంగా దీనిని నడపవలసిన అవసరంలేదనిపిస్తున్నది. మన వ్యాసాలలో లింకులు చేర్చేటప్పుడు మూల లింకు, తేదీ చేర్చి, బ్రౌజర్ లో స్థాపించుకున్న ఇంటర్నెట్ ఆర్కైవ్ ఎక్స్టెన్షన్ (ఉదా: ఫైర్పాక్స్ కొరకు) ద్వారా ఆర్కైవ్ లో చేర్చితే ఆ మూల లింకు పనిచేయనప్పుడు InternetArchiveBot ఆర్కైవ్ లింకు చేర్చుతుంది. ఒకవేళ వికీపీడియా సంపాదకుడు ఆర్కైవ్ లో చేర్చకపోతే, వేరే ఇతరులు చేర్చినా లేక Alexa వెబ్ వీక్షణల విశ్లేషణ యంత్రం ద్వారా ప్రజాదరణ పొందిన వెబ్సైట్ల లింకులు ఆర్కైవ్ లో భద్రప్రరచినట్లైతే ఆ లింకులను బాటు వాడుకుంటుంది. --అర్జున (చర్చ) 04:23, 9 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

check date దోషాలు[మార్చు]

అర్జున గారు, IABot ద్వారా చేస్తున్న మూలాల లంకెలలకు ఆర్కైవ్ లింకులు జోడించు సమయంలో మూలంలోని archivedate= లో ఇంగ్లీష్ లో ఉన్న నెల పేరును తెలుగులోకి (12 February 2020 →12 ఫిబ్రవరి 2020) మార్చుతుంది. నెల పేరు తెలుగులోకి మారడంవల్ల Check date values in: |archivedate= (help) అని వస్తుంది. అలా రాకుండా చేయడానికి ఏవన్న మార్గాలు ఉన్నాయా.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:18, 24 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Pranayraj Vangari గారికి, ఆంగ్ల వికీలో కోడ్ మార్పులు తెవికీలోకి చేరినందువల్ల, ఈ దోషం ఏర్పడింది.
  • (చూపించు/దాచు) 2020-02-22T05:08:56 తేడాలు చరితం 0‎ చి మాడ్యూల్:Citation/CS1/Utilities ‎ en:Module:Citation/CS1/Utilities నుండి కూర్పును దిగుమతి చేసాం
  • (చూపించు/దాచు) 2020-02-22T05:08:56 తేడాలు చరితం 0‎ చి మాడ్యూల్:Citation/CS1/Whitelist ‎ en:Module:Citation/CS1/Whitelist నుండి కూర్పును దిగుమతి చేసాం
  • (చూపించు/దాచు) 2020-02-22T05:08:56 తేడాలు చరితం 0‎ చి మాడ్యూల్:Citation/CS1/styles.css ‎ en:Module:Citation/CS1/styles.css నుండి కూర్పును దిగుమతి చేసాం (top) 1 మార్పును రద్దుచేయి
  • (చూపించు/దాచు) 2020-02-22T05:08:55 తేడాలు చరితం 0‎ చి మాడ్యూల్:Citation/CS1/Identifiers ‎ en:Module:Citation/CS1/Identifiers నుండి కూర్పులను దిగుమతి చేసాం
  • (చూపించు/దాచు) 2020-02-22T05:08:54 తేడాలు చరితం 0‎ చి మాడ్యూల్:Citation/CS1/Date validation ‎ en:Module:Citation/CS1/Date_validation నుండి కూర్పులను దిగుమతి చేసాం
  • (చూపించు/దాచు) 2020-02-22T05:08:53 తేడాలు చరితం 0‎ చి మాడ్యూల్:Citation/CS1 ‎ en:Module:Citation/CS1 నుండి కూర్పును దిగుమతి చేసాం
  • (చూపించు/దాచు) 2020-02-22T05:08:53 తేడాలు చరితం 0‎ చి మాడ్యూల్:Citation/CS1/Configuration ‎ en:Module:Citation/CS1/Configuration నుండి కూర్పును దిగుమతి చేసాం
ప్రస్తుతానికి ఇవి రద్దు చేయగా దోషం పరిష్కరించబడింది. ఈ కోడ్ పై పట్టు లేదు కావున, వీటిని తాజాపరచకుండా వుంచడమే ప్రస్తుతానికి పరిష్కారం. [[User:en>Trappist the monk‎]], User:Chaduvari గమనించగోర్తాను. అర్జున (చర్చ) 05:57, 25 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ఇకపై కొత్త కూర్పులను దిగుమతి చెయ్యకూడదు అంటారు, అంతేగా.., సరేనండి. __చదువరి (చర్చరచనలు) 08:43, 25 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికిపీడియా లోగో ట్యాగ్‌లైన్ గురించి[మార్చు]

ఒకచిన్న అనుమానం వివరింపగలరు Wikipedia . The Free Encyclopedia అంటే సమానార్దం వికీపీడియా ఉచిత సర్వ శాస్త్ర నముచ్చయం కదా .. మనం దీనిని విజ్ఞాన సర్వస్వం ఎందుకన్నారు... ఇంగ్లీష్ ప్రకారం అయితే వికీపీడియా ఉచిత శాస్త్ర సర్వస్వం లేదా కన్నడం మాదిరిగా ವಿಕಿಪೀಡಿಯ ಒಂದು ಸ್ವತಂತ್ರ ವಿಶ್ವಕೋಶ అనాలికదా , చాలా భాషల వికీలోగో లలో విజ్ఞాన అన్న పదం లేదు ఎందుకు మనం తెలుగు లొగొలో ఆంగ్లం Knowledge లో లేని జ్ఞానం చేర్చాం Kasyap (చర్చ) 10:49, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రభారతి నిఘంటువు ప్రకారం free అనగా "స్వేచ్ఛ", encyclopedia అనగా "విజ్ఞాన సర్వస్వం" కదా. అందువలన అలా అనువాదం చేసి ఉంటారు.--కె.వెంకటరమణచర్చ 11:12, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అంధ్రభారతి ప్రకారం Encyclopedia అన్న పదములో విజ్ఞానం లేదు , మీ గమనికకు

Encyclopedia : బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852 n. s. సర్వ విద్యాసంగ్రహమనే గ్రంధం, సర్వశాస్త్ర సముచ్చయమనే గ్రంధము, అక్షరక్రమ నిఘంటు, యిందులో సమస్త శాస్త్రములున్నవి.

En-cyclo-pae'dia, En-cyclo-pedia : శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972 n. సర్వవిద్యా విషయములను శాస్త్రవిషయములను గుఱించి అకారాదిగా వ్రాయఁబడిన గ్రంథము, శబ్దార్థసర్వస్వము, సర్వసంగ్రహ నిఘంటువు, విశ్వకోశము, cyclopedia, a dictionary bearing on things objects & all facts of universal information (and not of words) As per cambridge dictionary , encyclopedia is a large collection of information about one or many subjects, often arranged alphabetically in articles in a book or set of books, or available through a computer. ఇక్కడ కూడా knowledge / విజ్ఞానం లేదు.  Kasyap (చర్చ) 11:54, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక్కో భాషలో ఒక్కో పదానికి అర్థం ఒక్కో మూలం నుంచి వస్తుంది. ఉదాహరణకు: తెలుగులో వర్థంతి అంటే చనిపోయిన తేదీకి వార్షికోత్సవం అని కదా మనం వాడుతున్నది. దానికి సంస్కృతంలోనూ, కన్నడంలోనూ అర్థం - పుట్టినరోజు అని. అంతమాత్రాన తెలుగువారిని దండించి దాన్ని పుట్టిన రోజుకు సమంగా వాడలేం. అలానే, ఫిల్మ్ అనే పదాన్ని సినిమాకు సమానార్థకంగా ఇప్పటికీ ఇంగ్లీషులోనూ, దాని ప్రభావం ఉన్న అనేక భాషల్లోనూ వాడుతున్నారు. ముడి ఫిలిం వాడి సినిమాలు తీసే రోజుల నాటిదీ వ్యుత్పత్తి. ఐతే, ఇప్పుడు డిజిటల్ వచ్చింది కదాని ఫిల్మ్ అన్న పదాన్ని నిషేధించి డిజిటల్స్ అని మార్చలేం. ఫిల్మ్ స్టడీస్, ఫిల్మ్ ఫేర్, ఫిల్మ్స్ అన్న పదాలు అలానే ఉంటాయి. భాష సాగే తీరును అవగాహన చేసుకోగలమే తప్ప దాన్ని తిప్పలేం. అదొక నదీ ప్రవాహం లాంటిది. ఇప్పుడు మన ఎన్‌సైక్లోపీడియా విషయానికి వస్తే దానికి 1853లోనూ, 1972లోనూ ఎలాంటి అర్థాలు నిఘంటువులు ఇచ్చాయన్నది ఈనాటి భాషా వ్యవహారానికి కొలమానం కాదు. ఎన్‌సైక్లోపీడియా అన్న పదానికి పత్రికాపదకోశం (ప్రెస్ అ.) 2004 ఇచ్చిన అర్థం విజ్ఞాన సర్వస్వం/కోశం, అంతకన్నా ప్రామాణికుడు బూదరాజు రాధాకృష్ణ- ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008 ఇచ్చిన పదం విజ్ఞానసర్వస్వం. కాబట్టి, ఈ ప్రతిపాదనకు బలం లేదు. en:Wikipedia:Purpose చదివి చూడండి "The goal of a Wikipedia article is to present a neutrally written summary of existing mainstream knowledge in a fair and accurate manner with a straightforward, "just-the-facts style". అన్న ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ప్రకారం చూసినా మన విజ్ఞాన సర్వస్వం అన్న పదం నప్పుతోంది. (నప్పకున్నా పదానికి తెలుగు అనువాదం ఎలా ఉంటే అలా స్వీకరించాలి, కానీ నప్పుతోంది అని విడిగా చెప్తున్నాను) బాంగ్లా భాషలో విశ్వకోశం అన్నది వారి భాషా చరిత్ర ప్రకారం విజ్ఞాన సర్వస్వానికి ఏర్పడిన పదం అయితే వాళ్ళని అది ఉంచనివ్వండి. మనకేం అభ్యంతరం ఉండనక్కరలేదు. మన భాష ప్రకారం ఇది విజ్ఞాన సర్వస్వం కాబట్టి ఇదిలా ఉండనిద్దాం. -పవన్ సంతోష్ (చర్చ) 13:06, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మన ట్యాగ్‌లైన్‌కి మనం చేసుకోవాల్సిన ఒకే ఒక మార్పు "విజ్ఞాన సర్వస్వము" అన్నదాన్ని "విజ్ఞాన సర్వస్వం" చేయడం. అదైనా ఎందుకంటే మన శైలి ప్రకారం ప్రతీచోటా ము బదులు, పూర్ణానుస్వరం ఉండాలన్నది నియమం కాబట్టి ఆదిలోనే హంసపాదులాగా మనం పెట్టిన నియమాన్ని మన లోగోలోనే తూట్లు పొడిస్తే సరికాదు కాబట్టి. మరోటి ఉంది చూడండి- ఇటీవల వాడిన రెండు నిఘంటువుల్లోనూ విజ్ఞాన సర్వస్వం అనే ఉంది తప్ప విజ్ఞాన సర్వస్వము అని లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 13:08, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పైన పవన్ సంతోష్ గారు చెప్పిన అబిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 16:00, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మన శైలి ప్రకారం ప్రతీచోటా "ము" బదులు, పూర్ణానుస్వరం ఉండాలన్నది నియమం కాబట్టి లోగోలో "స్వేచ్ఛా విజ్ఞానా సర్వస్వం" అని మార్చితే బాగుంటుంది.--కె.వెంకటరమణచర్చ 16:18, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఎన్‌సైక్లోపీడియాకు విజ్ఞాన సర్వస్వం అనేది సరిగా ఉందని నాకు తోస్తోంది. ప్రస్తుతానికి వస్తే విజ్ఞాన సర్వస్వము స్థానంలో విజ్ఞాన సర్వస్వం రాయాలనేది నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 16:31, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు టైగర్ 2019-20[మార్చు]

ఈ యేటి ప్రాజెక్టు టైగర్ గణాంకాలివి. నేను 2020 జనవరి 12 న మధ్యాహ్నం 12 గంటలకు చూసిన గణాంకాలివి:

  • వాడుకరులు: 42
  • వ్యాసాలు: 416
  • మార్కులు: 93
  • మార్కులకు అర్హత పొందని వ్యాసాలు: 323
  • నిర్ణేతలు: Pavan santhosh.sPranayraj1985

మార్కులు వచ్చిన వ్యాసాలను నేను చూడలేదు. అయినా సరే.., నిర్ణేతలిద్దరూ వచ్చిన వ్యాసాలను వచ్చినట్టు పోస్ట్‌మ్యాన్ల లాగా ముద్దర్లేసెయ్యడం కాకుండా, చక్కటి విచక్షణ ప్రదర్శించారని ఈ గణాంకాలను బట్టి చెప్పవచ్చు. వారిద్దరికీ నా అభినందనలు. ఇక ముందు పోటీల్లో పాల్గొనేవారందరికీ వ్యాసార్హతలను ఎలా నిర్ణయిస్తారో ముందే చెప్పేస్తే బాగుంటుంది. అలాగే ఇంకొక సంగతి.. పోటీలో మార్కులు పొందేందుకు అర్హత సాధించని వ్యాసాలు వికీలో అసలెందుకు ఉండాలి. వాటిని అదే ప్రమాణాలను బట్టి తొలగించవచ్చు గదా! అని నా అభిప్రాయం. నిర్ణేతలిద్దరూ, ఇతర వాడుకరులూ నా సూచనను పరిశీలించి అభిప్రాయాలు చెప్పవలసినది.__చదువరి (చర్చరచనలు) 06:55, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పోటీలో పాల్గొన్న అత్యధికులు అర్థం కాని యాంత్రిక అనువాదాలను చేసారు. ఆ కృతక భాష గల వ్యాసాలను కనీసం శుద్ధి చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ వ్యాసాలు మార్కులు పొందేందుకు కూడా అర్హమైనవి కాదు. కనుక వాటిని తొలగిస్తే మంచిదని నా అభిప్రాయం.--కె.వెంకటరమణచర్చ 09:46, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ యాంత్రిక అనువాద వ్యాసాన్ని సృష్టించి, ప్రచురించేందుకు ఒక్క నిమిషం చాలు వాళ్ళకు. అసలు తెలుగు రానే అక్కర్లేదు ఈ పని చెయ్యాడానికి. మనం మాత్రం.. దాన్ని ఏం చెయ్యాలి, ఎలా సంస్కరించాలి, తొలగించడానికి చర్చలు, తొలగించడం.. ఇలాంటి పనుల మీద గంటలు గంటలు సమయం ఖర్చు చేస్తున్నాం. సిల్లీగా అనిపిస్తోంది ఇదంతా. ఇకనుండి, మనం మరింత గట్టిగా ఉండాలి.. కొత్త పాత అని చూడకుండా చర్యలు తీసుకోవాలి. అలాంటి చెత్త భాషతో కూడిన వ్యాసాలను కేవలం రెండే రోజుల సమయం ఇచ్చి, భాషను సంస్కరించకపోతే మరే చర్చా లేకుండా తొలగించెయ్యాలి. అలాంటి భాషతో కూడిన వ్యాసం మరొక్కటి రాసినా ఆ వాడుకరిపై చర్య తీసుకోవాలి. నా సూచనలివి. ఇతర వాడుకరులు దీనిపై స్పందిస్తే ఒక నిర్ణయం తిసుకోవచ్చు. __చదువరి (చర్చరచనలు) 13:11, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మొలకల నియంత్రణ[మార్చు]

చర్చ:అయోడిన్ పేజీలో కె.వెంకటరమణ గారు, యర్రా రామారావు గారూ చేసిన చర్చ చూడండి. మొలకల గురించి 2013 లో చేసిన మొలకపేజీల నియంత్రణ విధానాన్ని వారు ప్రస్తావించారు. ఆ విధానం ప్రకారం మొలకలను వీలైతే విలీనం చేసి, కాకుంటే తొలగించకుండానే తొలగించెయ్యాలి. తొలగించేద్దాం. ఇకపై దాని గురించి చర్చ చెయ్యకుండా. కాకపోతే దానికి ముందు, మొలకలను సృష్టించి అలాగే వదిలి పారేసిన పాపంలో మనలో ఎవరెవరికి ఎంత భాగం ఉందో చూద్దామనుకుంటున్నాను. చూసి, ఇక్కడ ప్రచురిస్తాను. __చదువరి (చర్చరచనలు) 01:33, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

  • చదువరి గారు మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను.ఇది మంచి ఉద్దేశమే.ఎవరు చేసిన తప్పులు వార్కి కనపడవు.ఇంకొకరు ఎత్తి చూపితే భాదపడవలసిన పనిలేదు. ఎందుకంటే అవి మన విజయాలకు సోపానాలు (మెట్లు) లాంటివి.ఎంత ఎత్తుకైనాసనాయాసంగా ఎదగటానికి దోహదపడిందని నేను నమ్ముతున్నాను.--యర్రా రామారావు (చర్చ) 10:12, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • తెవికీలో ఎవరికివారు మొలకలు సృష్టించి వదిలేస్తున్నారు కాబట్టి మొలక పేజీల నియంత్రణ ఖచ్చితంగా ఉండాలి. చదువరి గారూ చెప్పినట్టు, మొలక వ్యాసాల జాబితాను చూసి నావి ఏవన్న మొలక వ్యాసాలు ఉంటే వాటిని అభివృద్ధి చేస్తాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:44, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇదివరకు రచ్చబండలో ఎవరి మొలకల బాధ్యత వారికి విభాగంలో ఎవరు రాసిన మొలకకు వారు విస్తరించాలని చర్చ జరిగింది. అందులో భాగంగా వాడుకరి ఉపపేజీలుగా ఆయా వాడుకరులు రాసిన మొలకలను బాటు ద్వారా వైజాసత్య తయారుచేసి ఇచ్చారు. అప్పుడు ఆయా జాబితాలలోని మొలకలపై వాడుకరులు కృషి చేసి మొలక స్థాయిని దాటించే కృషి చేసారు. అదే విధంగా వాడుకరుల పేరుబరితో ఉపపేజీగా వారు రాసిన మొలక జాబితా తయారు చేయండి. కొంత సమయం ఇవ్వండి. అప్పటికీ వారు ఆయా జాబితాలలో మొలకలను విస్తరించని పక్షంలో తొలగించండి.--కె.వెంకటరమణచర్చ 13:19, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • క్రియాశీల వాడుకరులు సృష్టించిన మొలక వ్యాసాల గణాంకాలు పేజీని తయారు చేసాను. పరిశీలించండి. వీలైనంత వరకు ప్రస్తుతం పని చేస్తూ ఉన్న వాడుకరులందరి డేటా ఇందులో ఉంది. ఇటీవలి కాలంలో యాంత్రికానువాదం ద్వారా పేజీలు సృష్టించిన వారి డేటాను పరిగణించలేదు. ప్రస్తుతం క్రియాశీలంగా ఉంటూ, అర్థవంతమైన దిద్దుబాట్లు చేస్తూ ఉన్న వాడుకరి:MSG17 వంటి కొత్తవారి డేటాను ఇందులో చేర్చలేదు -వారు ఎక్కువ పేజీలు సృష్టించలేదు కాబట్టి. పైన నేను రాసిన "పాపంలో మనలో ఎవరెవరికి ఎంత భాగం ఉందో" అనేది కేవలం చెతురుగా రాసిందే తప్ప మొలకలు సృష్టించడం తప్పు, పాపం అనే భావనతో రాసినది కాదు. మొలక లేనిదే మొక్క లేదు, మాను లేదు అని నా అభిప్రాయం. కాకపోతే అవి మొలక స్థాయి లోనే ఉండిపోకూడదు. మొత్తం వ్యాసాలతో పోలిస్తే నైష్పత్తికంగా మన దగ్గర మొలకలు ఎక్కువగా ఉన్నాయేమోనని నాకు తోస్తోంది. తెవికీలో ఇవ్వాళ ఉన్న మొత్తం వ్యాసాలు 71,933 కాగా, మొలకలు (2048 బైట్ల కంటే తక్కువ) 8175 అంటే 11.36%. గ్రామ వ్యాసాలను విస్తరించకముందు ఈ శాతం 35 పైనే ఉండేది. ఈ పేజీలో కేవలం మొలకల సంఖ్య మాత్రమే ఇచ్చాను. వాడుకరి వారీగా మొలకల జాబితా ఎక్కడ పొందాలో ఆ పేజీలో ఇచ్చాను (బాటు ద్వారా మొలకల జాబితాను పొందడం ఎలాగో నాకు తెలీదు).
వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం లో సూచించిన మార్గదర్శకాన్ని అనుసరించి మొలక వ్యాసాల సంఖ్యను నియంత్రించుకుందాం. __చదువరి (చర్చరచనలు) 15:52, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

శీర్శిక మాత్రమే ఉన్న సినిమా పేజీలు ఎలా వాడుకోవచ్చో గమనించండి[మార్చు]

బావలు అనుభవాలు అనే శీర్శిక గల సినిమా వ్యాసం పేజి ఇది.ఇది బాటు ద్వారా 2006 సృష్టించబడింది.ఇది 13 సం.ములు క్రిందట సృష్టించిన నాటి నుండి ఇప్పటివరకు వరకు అలానే ఉంది.ఇలాంటివి వేలలోనే ఉన్నాయనుకోండి.కరెక్టుగా ఎన్ని ఉన్నాయో నేనైతే సరియైన సంఖ్య చెప్పలేకపోవుచున్నాను.ఇక పోతే బావలు అనుభవాలు అనే పేజీకి వద్దాం.వాడుకరి:Doddi mallesh గారు తన వాడుకరి పేజీ, చర్చా పేజీలో తన స్వంత విషయాలు రాసుకున్న దానితో తృప్తి చెందక, ఈ పేజీలో భావాలు, అనుభవాలు రాసుకోవచ్చు అనుకున్నాడేమో, ఆ పేజీలోని సమాచారపెట్టె అది ఏకంగా తీసివేసి, తన స్వంత విషయాలు రాసుకున్నాడు. గమనించండి. అయితే చివరి కూర్పు వరకు తిప్పికొట్టాననుకోండి. అదే వేరే సంగతి.అసలు విషయం బాటుతో సృష్టించిన ఇలాంటి సినిమా పేజీలుపై తగిన నిర్ణయంపై చర్చా పేజీలో చర్చించవలసి ఉంది.ఈ విషయంపై తెవికీ జన్మదిన వేడుక 2019 సందర్బంగా జరిగిన సమావేశంలో వాడుకరి:ప్రణయరాజ్ గారు కూడా ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వెలిబుచ్చారు.ఆలా ఆ వ్యాసాలను ఎన్నాళ్లు అలా వికీపీడియాలో ఉంచుదాం.అవి ఎవరైనా అంత శ్రమ తీసుకొని ముందుకువచ్చి అభివృద్ది చేస్తారని నేను బావించుటలేదు.ఈ అంశం కూడా మొలకలకు సంబంధించినదే కావున దీనిపై గౌరవ వికీపీడియన్లు చర్చించి తగు నిర్ణయం తీసుకొనగలందులకు చర్చకు తీసుకొని రావడమైనది.--యర్రా రామారావు (చర్చ) 13:39, 14 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

  • యర్రా రామారావు గారూ, చాలా సినిమా వ్యాసాలలో సమాచార పెట్టె తప్ప ఏ విషయాలూ లేవు. వాటిలో కూడా విషయం సంగ్రహంగా ఉంది. ఇటువంటి మొలకలను ఎవరూ చాలాకాలంగా విస్తరించడంలేదు. కనుక విషయం లేని ఇటువంటి వ్యాసాలనన్నింటినీ ఒక జాబితాగా తయారుచేసి, అందులో ఆ సమాచారపెట్టెలో దర్శకుడు, నిర్మాణ,సంస్థ, సంవత్సరం మొదలైన అంశాలను పట్టిక రూపంలో చేర్చి ఆయా మొలక వ్యాసాలను తొలగించాలి. ఎవరైనా సదరు సినిమా వ్యాసాన్ని విస్తరించాలంటే ఆ జాబితా లోని సినిమా పుట ఎర్ర లింకులపై క్లిక్ చేసి విస్తరిత వ్యాసాలను రూపొందించుకుంటారు.--కె.వెంకటరమణచర్చ 13:20, 15 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • 2006లో బాటు ద్వారా సినిమా పేజీలు సృష్టించబడ్డాయి. అందులోనూ కేవలం సమాచారపెట్టెతో మాత్రమే ఉన్నాయి. చాలారోజులుగా యర్రా రామారావు గారు,నేను వీటి గురించి చర్చించుకుంటున్నాము. తెవికీ జన్మదిన వేడుక 2019 సందర్భంగా ఈ విషయమై ప్రస్తావించగా, వాటిని తొలగించకుండా అభివృద్ధి చేయడమే సరియైనదని అన్నారు. కేవలం సమాచారపెట్టెతో ఉన్న సినిమా వ్యాసాలలోని కొన్నింటిలో ఆయా సమాచారం కూడా తప్పుగా ఉంది. వ్యాసాలలో సమాచారపెట్టెలోని సంగీతం విభాగంలో చక్రవర్తి అనే ఉంది కాబట్టి, సమాచారపెట్టెను కూడా సరిచేయాల్సివుంది. కనుక, గ్రామ వ్యాసాలను అభివృద్ధి చేసినట్టు వీటిని కూడా ఒక యజ్ఞంలా తీసుకొని చేసేవాళ్ళు అవసరం. మరి, ఈ పనిచేసేవారు ఎవరు?, ఎన్నిరోజుల్లో చేస్తారు?, ఎవరో ఎప్పటికో చేస్తారని ఎదురుచూస్తూ వాటిని అలానే వదిలేద్దామా?అనేవి చూసుకోవాలి. లేదా, ఎలాగూ మొలక వ్యాసాలను తొలగించాలని అనుకుంటున్నాం. ఇవికూడా మొలక వ్యాసాలే కాబట్టి, కె.వెంకటరమణ గారు చెప్పినట్టు ఒక జాబితాగా తయారుచేసి,ఆయా మొలక వ్యాసాలను తొలగించడమైనా చేయాలి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:27, 15 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
*Pranayraj Vangari "వ్యాసాలలో సమాచారపెట్టెలోని సంగీతం విభాగంలో చక్రవర్తి అనే ఉంది కాబట్టి, సమాచారపెట్టెను కూడా సరిచేయాల్సివుంది." ఈ వాక్యం అర్థం కాలేదు. కాస్త వివరించండి.--స్వరలాసిక (చర్చ) 03:16, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
*స్వరలాసిక గారు, గతంలో నేను కొన్ని సినిమా వ్యాసాలను అభివృద్ధి చేశాను. నేను గమనించిన కొన్ని వ్యాసాలలో ఆయా సినిమాలకు సంగీతం అందించినవారు వేరే సంగీత దర్శకులు కాగా సంగీతం చక్రవర్తి అని ఉంది. వాటిని సరిచూసుకోవాలి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:40, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ULS లిప్యంతరీకరణ జ్ఞ గుణింతం దోషం పరిష్కారం[మార్చు]

2013 లో గుర్తించిన లిప్యంతరీకరణతో జ్ఞ గుణింతం టైపు చేయటంలో దోషం ( తొలి చర్చ, సంబంధించిన ఇటీవలి చర్చ ) పరిష్కారం అయిందనితెలుపుటకు సంతోషించుచున్నాను. దీనికి కోడ్ మార్పులు User:Veeven, User:రహ్మానుద్దీన్ చేయగా, దీనిపై వికీమీడియా సమీక్ష తరువాత అవసరమైన సవరణలు నేను చేసాను. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఇంకేమైనా సమస్యలుంటే పరీక్షించి తెలియచేయండి. --అర్జున (చర్చ) 16:01, 14 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగేతర పేర్లను రాయడం ఎలా?-2[మార్చు]

తెలుగేతర పేర్లను రాయడం ఎలా అనే విషయంలో వాడుకరుల అభిప్రాయం కోరుతూ వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/తెలుగేతర పేర్లను రాయడం ఎలా? అనే పేజీ తయారైంది. (దీని గురించి రచ్చబండలో ఒకసారి తెలియజేసాను). వాడుకరులంతా అక్కడ వ్యాఖ్యానించవలసిందిగా విజ్ఞప్తి.__చదువరి (చర్చరచనలు) 02:52, 17 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2019 అధిక వీక్షణల పేజీలు[మార్చు]

వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్/topviews trends/2019 చూడండి. అత్యధిక 10 లో మహాత్మా గాంధీ ,కుక్కుట శాస్త్రం,ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ రాంకులు మారలేదు. వీటిలో కుక్కుట శాస్త్రం సాఫ్ట్వేర్ సమస్య వలన False positive అని నా అనుమానం. గతంలో బగ్ నమోదు చేశాను. ఇక అత్యధిక 100 లో చంద్రయాన్-2 ,రైతు, భారత దేశం, చార్మినార్,హనుమాన్ చాలీసా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం,జార్జ్ రెడ్డి కొత్తగా చేరాయి. --అర్జున (చర్చ) 06:20, 17 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Wiki Loves Folklore[మార్చు]

Hello Folks,

Wiki Loves Love is back again in 2020 iteration as Wiki Loves Folklore from 1 February, 2020 - 29 February, 2020. Join us to celebrate the local cultural heritage of your region with the theme of folklore in the international photography contest at Wikimedia Commons. Images, videos and audios representing different forms of folk cultures and new forms of heritage that haven’t otherwise been documented so far are welcome submissions in Wiki Loves Folklore. Learn more about the contest at Meta-Wiki and Commons.

Kind regards,
Wiki Loves Folklore International Team
— Tulsi Bhagat (contribs | talk)
sent using MediaWiki message delivery (చర్చ) 06:15, 18 జనవరి 2020 (UTC)
[ప్రత్యుత్తరం]

మహేష్ గారూ, మీరు ప్రతిపాదించిన మేడారం జాతర ఫోటోల పోటీకి అనుగుణంగా ఉంది ఇది చూసారా? __చదువరి (చర్చరచనలు) 08:36, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, అనుగుణంగా ఉండడమే కాదండి, ఫెబ్రవరి నెల కూడా కలిసి వచ్చింది. మనం చేయవలసినదల్లా దీని గురించి మన ప్రాంతంలో తెలియజేయడం.--IM3847 (చర్చ) 12:06, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సరి.__చదువరి (చర్చరచనలు) 15:04, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ ఈ పోటీకు తెలుగు అనువాద పేజీను మీరు ఇక్కడ చూడగలరు.--IM3847 (చర్చ) 04:41, 28 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
IM3847 గారూ, బాగుంది. __చదువరి (చర్చరచనలు) 05:38, 28 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాస పరిమాణం[మార్చు]

వికీపీడియా చర్చ:మొలకపేజీల నియంత్రణ విధానం ప్రకారం వ్యాస పరిమాణం (2000 బైట్ల మరియు కనీసం ఒక అంతర్గత లింకు) ఉండాలని ఉంది. వ్యాస పరిమాణాన్ని ఎలా తెలుసుకోవాలి. ఉదాహరణకు టెరా- వ్యాసాన్ని తీసుకుంటే ఆ వ్యాస నీలం లింకుపై మౌస్ కర్సర్ ఉంచితే 5.2 కె.బి అని చూపిస్తుంది. ఆ వ్యాస చరిత్రలో 7,039 బైట్లు ఉన్నది. 7,039 బైట్లు అనగా 7,039/1024 = 6.87 కె.బి వస్తుంది. ఏది ఖచ్చితమైనది? --కె.వెంకటరమణచర్చ 12:26, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారూ, పేజీ పరిమాణం కింది విధాలుగా చూడొచ్చండి
  1. పక్కన నేవిగేషను పట్టీలో "పేజీ సమాచారం" నొక్కితే ఆ పేజీ పరిమాణం వస్తుందండి.
  2. https://xtools.wmflabs.org/articleinfo/te.wikipedia.org/ ఈ url చివర మనకు అవసరమైన పేజీ పేరు ఇచ్చి కొడితే పేజీ సమాచారం వస్తుంది.
  3. mw.loader.load('//meta.wikimedia.org/w/index.php?title=User:Hedonil/XTools/XTools.js&action=raw&ctype=text/javascript');
పై లైన్ను మీ వాడుకరి:K.Venkataramana/common.js పేజీలో పెట్టుకుంటే ప్రతీ పేజీలోనూ శీర్షిక కింద, ఆ పేజీ గణాంకాలు ఒకే లైనులో చూపిస్తుంది. అక్కడున్న లింకును నొక్కితే పైన రెండో పాయింటులో చూపిన url కు తీసుకుపోతుంది. అసలు ఆ xtools బోలెడంత సమాచారం - వాడుకరుల గురించి, పేజీల గురించి, ప్రాజెక్టు గురించీ - చూపిస్తుందండి.
ఇక పోతే, పరిమాణంలో తేడా.. ఈ పాపప్ నేవిగేషన్లో తక్కువ ఎందుకు చూపిస్తోందో తెలియదు - బహుశా ట్రాన్స్‌క్లూజన్ల లాంటి కొన్నిటిని కలపదేమో, లేక పాత డేటాను చూపిస్తుందేమో. కానీ అది తప్పని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీ పరిమాణం మరీ తక్కువగా చూపిస్తోంది. ఏదేమైనప్పటికీ, మనం చూడాల్సింది "7,039 బైట్లు" అని చూపించే చోటనే నండి. __చదువరి (చర్చరచనలు) 14:44, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సందేహ నివృత్తి చేసినందుకు చదువరి గారికి ధన్యవాదాలు.--కె.వెంకటరమణచర్చ 15:50, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • కె.వెంకటరమణ గారికి, విధానం ముసాయిదా చర్చకు వచ్చినప్పుడు ఇవి అన్నీ పరిశీలించటం జరిగింది. బొమ్మ వుంటే వెయ్యి బైట్లగా పరిగణించాలన్న ఆలోచనకూడా వచ్చింది. కాని అమలులో సౌలభ్యం దృష్ట్యా చరిత్రలో కనబడే గణాంకాలు అనగా పేజీ దర్శించినపుడు సర్వర్ నుండి వచ్చే పాఠ్య సమాచారంచరిత్రలో కనబడే పరిమాణం మాత్రమే పరిగణించాలని నిశ్చయించాము. ఇక మునుజూపు లో కనబడే పరిమాణం వికీపీడియా సర్వర్లో భద్రపరచబడే వికీటెక్స్ట్ పరిమాణం అనుకుంటాను.--అర్జున (చర్చ) 05:23, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగింపు కొరకు వ్యాసాలు[మార్చు]

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో 28 తొలగింపు ప్రతిపాదనలు ఉన్నాయి. నిర్వాహకులెవరైనా వాటిని పరిశీలించి, నిర్ణయం తీసుకుని, దాన్ని అమలు చెయ్యాల్సిందిగా విజ్ఞప్తి (నేను వాటిలో వ్యాఖ్యానించడమో, ప్రతిపాదించడమో చేసి ఉన్నాను. కాబట్టి తొలగించడం లేదు). __చదువరి (చర్చరచనలు) 15:39, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి, ఈ వ్యాసాలను పరిశీలించి కొన్ని కృతక భాష వ్యాసాలను తొలగిస్తున్నాను. కొన్నింటిని కొద్ది మార్పులుచేసి మంచి వ్యాసంగా మలచి ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. కొన్నింటిని అదే పేరుతో ఉన్న వ్యాసంలో విలీనం చేస్తున్నాను. ఈ గూగుల్ అనువాద వ్యాసాలను తొలగించునపుడు తొలగింపు కారణాలలో "కృతకభాష, యాంత్రిక అనువాదం" అనే అంశాన్ని కూడా చేరిస్తే బాగుంటుంది.--కె.వెంకటరమణచర్చ 02:39, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి, తొలగింపు వ్యాసంపై నిర్ణయం జరిగిన వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నిర్మలా (నవల) వంటి పుటలను ఎక్కడ చేర్చాలి? వాటికి ఏదైనా వర్గం లోకి చేరిస్తే బాగుండునేమో పరిశీలించగలరు. నిర్ణయం ప్రకటించిన తరువాత ఆ పుటలో "నిర్ణయం ప్రకటించడమైనది", "తొలగించబడినది" వంటి మూసలు ఏవైనా ఉంచి, వాటిని వర్గం:తొలగించబడిన వ్యాసాలు వంటి ఏదైనా వర్గంలో చేరిస్తే బాగుండునేమో పరిశీలించగలరు --కె.వెంకటరమణచర్చ 02:54, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారూ, కింది పద్ధతిని పాటించాలి సార్..
  1. ఆ పేజీలో (వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఉదాహరణపేజీ) చర్చకు పైన {{వ్యాతొలపైన}} అనే మూసను రాసి దాని పక్కనే ఒక్క స్పేసు తరువాత నిర్ణయం ఏంటో అది రాసి దాని పక్కన సంతకం పెట్టాలి. అంటే {{వ్యాతొలపైన}} తొలగించాలి ~~~~ అని గానీ {{వ్యాతొలపైన}} ఉంచెయ్యాలి ~~~~ అని గానీ రాయాలి.
  2. చర్చకు కింద, {{వ్యాతొలకింద}} అనే మూసను ఉంచాలి.
  3. పేజీని భద్రం చెయ్యాలి. {{వ్యాతొలకింద}}మూస ఉంచడంతో ఈ పేజీ వర్గం:ముగిసిన తొలగింపు చర్చలు అనే వర్గం లోకి చేరుతుంది.
  4. తదుపరి పనులు..
    1. ఈ చర్చ పేజీని (అంటే ఉదా:వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఉదాహరణపేజీ) వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పాతవి-2 లో ట్రాన్స్‌క్లూడు చెయ్యాలి. అంటే {{వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఉదాహరణపేజీ}} అని చేర్చాలి.
    2. వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు#తాజా చేర్పులు విభాగంలో ఉన్న ఈ పేజీ లింకును తీసెయ్యాలి.
  5. ఇక నిర్ణయాన్ని అమలు చెయ్యడం..
    1. నిర్ణయం తొలగించడం అయితే వ్యాసం పేజీని తొలగించాలి.
    2. నిర్ణయం ఉంచెయ్యడం అయితే, వ్యాసం పేజీ లోని తొలగింపు మూసను తీసెయ్యాలి.
__చదువరి (చర్చరచనలు) 03:18, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పైన రాసిన పద్ధతి అంతా యాంత్రికంగా చేసేదే. మనిషి చెయ్యాల్సిన పని లేదు. ఓ బాటో స్క్రిప్టో రాస్తే అది ఆ పని చేసుకుపోతుంది. మన వాడుకరుల్లో సాంకేతికులు ఈ పని చేపడితే బాగుంటుంది. ఇలాంటి పనులు ఇంకా కొన్ని ఉన్నాయి మనకు. అర్జున గారూ ఈ పనులను ఒక ప్రాజెక్టుగా తీసుకుని చేస్తారా?__చదువరి (చర్చరచనలు) 03:25, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, pywikibot వాడి చేయగలిగే పనులపైనే నాకు అనుభవమున్నది. అటువంటివాటికి నా సహాయం అవసరమైతే వికీపీడియా:బాటు సహాయానికి అభ్యర్ధనలు లో చేర్చి నా పేరు వుటంకించండి.--అర్జున (చర్చ) 05:27, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సరేనండి. pywikibot ఏంటో, అవి కానివేంటో వాటి మధ్య తేడాలేంటో నాకు తెలియదు. కానీ మీరు చెప్పిన చోట రాస్తాను.__చదువరి (చర్చరచనలు) 05:37, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, పైవికీబాట్ అంటే రకరకాల సాధారణ బాట్ పనులకు (పాఠ్య మార్చటం, పేజీలు పేరు మార్చటం లాంటివి) రాసివున్న స్క్రిప్టుల సముదాయం. మీరు AWB తో చేయగలిగేవి చాలా వరకు చేయవచ్చు. User:InternetArchiveBot లాంటివి ప్రత్యేకమైన పనికి ప్రత్యేకంగా రాసిన బాటు స్క్రిప్టులు అనుమాట. --అర్జున (చర్చ) 05:41, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారూ, ఒక చిన్న సవరణ.. {{వ్యాతొలపైన}} తొలగించాలి లేదా {{వ్యాతొలపైన}} ఉంచెయ్యాలి అని రాసాక పక్కనే సంతకం పెట్టాలి. ఆ సంతకం విషయం ముందు రాయలేదు. ఇప్పుడు చేర్చాను. గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 03:41, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, సందేహ నివృత్తికి ధన్యవాదాలు. మీరు చెప్పినట్లు నిర్ణయం ముగిసిన వ్యాసాలలో చేసాను.--కె.వెంకటరమణచర్చ 03:49, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలండి. __చదువరి (చర్చరచనలు) 05:37, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ నాణ్యత - యాంత్రికానువాద వ్యాసాల సమస్య[మార్చు]

గూగుల్ యాంత్రికానువాదం ప్రాజెక్టు ద్వారా దోషభూయిష్టమైన భాషతో కూడిన వ్యాసాలు అనేకం తెవికీలోకి వచ్చిపడ్డాయి. ఈ పేజీలన్నీ ప్రస్తుతం వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు వర్గంలో ఉన్నాయి. అసంబద్ధమైన వాక్య నిర్మాణం, అసహజమైన భాషా ప్రయోగాలు ఈ వ్యాసాల్లోని ప్రత్యేకతలు. వీటిని తొలగించెయ్యాలని గతంలో నిర్ణయం తీసుకున్నాం. అయితే కొందరు వాడుకరులు వీటిని మెరుగు పరచే ప్రయత్నం చేద్దామని ప్రతిపాదించి, కొంత ప్రయత్నం చేసారు. ఆ ప్రయత్నం ఇలా మొదలై, ఇలా సాగి, ఇక్కడ ఆగింది. అయితే, సదాలోచనతో చేసిన ఆ ప్రయత్నాలు పెద్దగా ముందుకు పోలేదు (ఈ పనిని మొదలెట్టిన పవన్ సంతోష్ గారికీ, అందులో పాలుపంచుకున్న వారికీ ధన్యవాదాలు). ఏవో కొన్ని వ్యాసాలు మెరుగైనప్పటికీ ఇంకా 1771 పేజీలు పై వర్గంలో ఉన్నాయి. అర్జునరావు గారు {{వికీప్రాజెక్టు గూగుల్ అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} అనే మూస ద్వారాను, ఒక బాటు ద్వారానూ - మెరుగుపరచిన వ్యాసాలను (సంఖ్య: 81) "గూగుల్ అనువాద వ్యాసాలు" వర్గం లోంచి తీసేసారు. కాబట్టి ఈ వర్గంలో మెరుగు పరచిన వ్యాసాలు ఇంకా ఉండి ఉండక పోవచ్చు (మెరుగు పరచాక కూడా ఆ పేజీలోని మూసను తీసెయ్యకపోతేనో, "మెరుగుపరచిన" మూసను పెట్టకపోతేనో లేదా నేరుగా "మెరుగుపరచిన" వర్గం లోకి చేర్చకపోతేనో తప్ప). ప్రస్తుతం నా ప్రతిపాదనలు ఏంటంటే,

  1. గత నిర్ణయం ప్రకారం వీటిని తొలగించాలి.
  2. ఒక్కటొక్కటిగా కాకుండా, వీటిని మూకుమ్మడిగా తొలగించాలి.
  3. ఈ ప్రతిపాదనపై చర్చ ముగిసిన రోజు నుండి వారం రోజుల పాటు ఆగి ఎనిమిదవ రోజున ఈ తొలగింపు చెయ్యాలి.

ఈ వారంలో..

  1. తాము భాషను సరిచేసి, మెరుగు పరచిన వ్యాసాలను పొరపాటున ఇంకా "గూగుల్ అనువాద వ్యాసాలు" వర్గం లోనే ఉంచేసారేమో వాడుకరులు పరిశీలించుకోవచ్చు.
  2. తాము ప్రస్తుతం మెరుగు పరుస్తూన్న వ్యాసాలను (మెరుగుపరచడం జరుగుతూ ఉంది) తొలగించనీకుండా, వాడుకరులు కాపాడుకోవచ్చు. ఆ వ్యాసాల్లో పైన {{యాంత్రికానువాదం భాషను శుద్ధి చేస్తాను}} అనే మూసను పెడితే తొలగింపు కాకుండా నివారించవచ్చు. (ఉదా: నేను నియాండర్తల్ అనే వ్యాసంలో పని ముగించాల్సి ఉంది)
  3. భవిష్యత్తులో తాము మెరుగు పరచాలని భావించిన వ్యాసాలను (పని ఇంకా మొదలు పెట్టనివి) తొలగించనీకుండా, వాడుకరులు కాపాడుకోవచ్చు. ఆ వ్యాసాల్లో కూడా పైన {{యాంత్రికానువాదం భాషను శుద్ధి చేస్తాను}} అనే మూసను పెడితే తొలగింపు కాకుండా నివారించవచ్చు. ఈ శుద్ధి పనిని నెల రోజుల్లోపు మొదలు పెట్టాలని గమనించవలసినది.

గమనిక: ప్రస్తుతం గూగుల్ అనువాద వ్యాసాలు వర్గంలో ఉన్న వ్యాసాలు, ఉపవర్గాల జాబితా వికీపీడియా:గూగుల్ యాంత్రిక అనువాద వ్యాసాల జాబితా - 2020 జనవరి 19 పేజీలో ఉంది. పేజీలను తొలగించాక, తిరిగి సృష్టించేవారికి ఈ జాబితా ఒక సూచికగా పనికొస్తుంది -స్వరలాసిక గారి సూచన మేరకు.

మద్దతు

ఈ ప్రతిపాదనపై వాడుకరుల స్పందన కోరుతున్నాను. __చదువరి (చర్చ •  రచనలు) 17:59, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

  • మద్దతు: వాడుకరి:Chaduvari గారే ఇటువంటి ప్రతిపాదనే గతంలో చేసినప్పుడు నేనే వ్యతిరేకించి వీటిని ఉంచితే మెరుగుపరచవచ్చన్నాను. ఐతే, లెక్కకు రానంత కొద్ది వ్యాసాలే మెరుగుపరచగలిగాం. కాబట్టి, ఈ ప్రతిపాదనను ఇప్పుడు బలపరుస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 01:30, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • మద్దతు: ఈ ప్ర్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నాను. అనేక సంవత్సరాలుగా ఈ వ్యాసాలు ఎవరూ శుద్ధిచేయకుండా ఉండిపోయాయి. కొన్ని వ్యాసాలను శుద్ధిచేశాము. కానీ కొన్ని వ్యాసాలను శుద్ధిచేసేకంటే కొత్తగా వ్యాసం రాయడం సులభం అని గ్రహించి వదిలేసాను. ఈ గూగుల్ వ్యాసాలలో కొన్నింటిని కొంతవరకు శుద్ధి చేసారు. కానీ అవి ఆ వర్గంలో ఉండిపోయాయి. ఉదా:అరుణ్ శౌరీ. ఇటువంటి వ్యాసాలను కూడా తొలగించాలా? కొన్ని వ్యాసాలు కృతక భాషతో మొదటి నుండి శుద్ధిచేయకుండా ఉండిపోయాయి. వాటిని తొలగించడం సరైన చర్య. 2019 డెసెంబరు 7న మరలా యాంత్రిక అనువాద వ్యాసాలు వందల సంఖ్యలో తెవికీలోకి చేరాయి. దోషభూయిష్టమైన భాషతో కూడిన ఈ వ్యాసాలను కూడా తొలగించాలి.--కె.వెంకటరమణచర్చ 02:11, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • మద్దతు: తెవికీ నాణ్యతను అనుసరించి గూగుల్ అనువాద వ్యాసాలను తొలగించడమే మంచిది. దీనికి నా మద్దతు కూడా తెలియజేస్తున్నాను. Pranayraj Vangari (Talk2Me|Contribs) 03:54, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • గూగుల్ అనువాద వ్యాసాల ఎంపిక భారతదేశంలో గూగుల్ శోధనాయంత్రంలో అధిక ఆంగ్ల పదాల శోధన అధారంగా ఎంపిక చేయబడింది. వీటిలో చాలా తెలుగు వాడుకరులకు ప్రాధాన్యమైనవి కావు. ప్రస్తుతం తెలుగు వికీలో లేని వ్యాసాలకు గూగుల్ అనువాదం వ్యాసం శోధనా పలితాలతో అప్రమేయంగా చూపుతున్నది. కావున. మెరుగుపరచని గూగుల్ అనువాద వ్యాసాలను తొలగించటం నేను సమర్ధిస్తాను.--అర్జున (చర్చ) 05:34, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • మద్దతు: తొలగించాలి. అయితే తొలగించిన వ్యాసాల జాబితా ఒకటి ఉంటే భవిష్యత్తులో వాటిని ఎవరైనా పునఃప్రారంభించే అవకాశం ఉంటుంది. స్వరలాసిక (చర్చ) 08:35, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • మద్దతు: తొలగించటానికి నా మద్దతు తెలియజేస్తున్నాను.వీటివలన ఇంకొక నష్టం కూడా ఉంది.సందిగ్దంగా ఉన్న పదం కోసం వెతికినప్పుడు ఇందులోని తప్పుడు పదాలు ఫలితాలుగా చూపించే అవకాశం ఉంది.--యర్రా రామారావు (చర్చ) 14:46, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • "మద్దతు:" అన్నింటినీ తొలగించేయండి.--Rajasekhar1961 (చర్చ) 08:39, 22 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • తొలగించడానికి నా మద్ధతు. స్వరలాసిక గారు చెప్పినట్లు తొలగించేముందు ఒక జాబితాగా వేయాలి. రవిచంద్ర (చర్చ) 12:14, 22 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • "మద్దతు" మెరుగుపరచడం కొరకు నేనూ మునుపు మొగ్గుచూపాను, కాని అది చేయలేనిపనిగానే మిగిలింది. కనుక తొలగించడమే ఉత్తమం..B.K.Viswanadh (చర్చ) 20:46, 23 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • " మద్దతు " మెరుగుపరచడం కంటే కొత్తవి సృష్టించడం సులువని భావిస్తున్నాను కనుక తొలగించడమే సరి అయినది. T.sujatha (చర్చ) 15:54, 24 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • < పై వరుసలో * తో మీ సంతకం అవసరమైతే వ్యాఖ్యతో చేర్చండి.>
తటస్థం
  • తటస్థం:యాంత్రిక అనువాదాల మెరుగు కోసం అనువాద వ్యాసాలు దోహదం చేస్తాయి , వీటిలో కొన్ని మరీ కృతంగా లేవు Kasyap (చర్చ) 11:52, 21 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • < పై వరుసలో * తో మీ సంతకం అవసరమైతే వ్యాఖ్యతో చేర్చండి.>
వ్యతిరేకం
  • < పై వరుసలో * తో మీ సంతకం అవసరమైతే వ్యాఖ్యతో చేర్చండి.>
చర్చ

Kasyap గారు ఇలా చెప్పారు: "యాంత్రిక అనువాదాల మెరుగు కోసం అనువాద వ్యాసాలు దోహదం చేస్తాయి, వీటిలో కొన్ని మరీ కృతంగా లేవు." వీటిపై నా అభిప్రాయం చెప్పదలచాను.

వ్యాసానికి ప్రాణం భాష! లింకులు, విభాగాలు, మూలాలు, మూసలు, వర్గాలు, బొమ్మలు.. ఇలాంటి హంగులన్నీ ఆ తరువాతే. అసలు భాషే సరిగ్గా లేకపోతే వ్యాసం అనేదే లేదు. ప్రాణం లేని బొమ్మకు పౌడరద్ది, బొట్టూ కాటుక పెడితే ఉపయోగమేంటి? యాంత్రికానువాద వ్యాసాల్లో ఉన్నటువంటి నాసిరకపు కృతక భాష ఉండే వార్తా పత్రికలు, వార పత్రికలూ మనం కొంటామా, చదువుతామా? పుస్తకాలు కొంటామా, కొనమని చెబుతామా? మరి మన తెవికీ విషయంలో మనకే ఎందుకంత చులకన భావం? మరీ కృతకంగా లేకపోవడం అంటే ఎంతో కొంత కృతకంగా ఉన్నాయనే అర్థం కదా! మరి ఎందుకు రాజీ పడాలి? మామూలు, వ్యాకరణ సమ్మతమైన, అక్షరదోషాల్లేని భాష అనేది కనీస మాత్రపు నాణ్యత కదా! మనం చేసేపనిలో కనీస నాణ్యత కూడా పాటించకపోతే ఎట్లా? ఐఐఐటీ వాళ్ళ ప్రాజెక్టులో చురుకైన పాత్ర పోషిస్తున్న కశ్యప్ గారు "మరీ కృతకంగా లేవు" అంటూంటే ఆందోళన కలుగుతోంది. ఓ పదిమందో ఇరవై మందో రాసిన 2000 వ్యాసాలను ఏం చేసుకోవాలో తెలీడం లేదు పదేళ్ళుగా. మరి, కొన్ని వందల వేల మందితో లక్షల కొద్దీ అనువాద వ్యాసాలు రాయించాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్న ప్రాజెక్టులో కొద్దిపాటి రాజీకి చోటిచ్చినా, జరిగే అనర్థం ఊహాతీతం. వెనక్కి తీసుకోలేని తప్పులు జరిగిపోయే ప్రమాదం ఉందని గ్రహించ ప్రార్థన. భాష విషయంలో ఆయన రాజీ పడరాదనీ, కచ్చితంగాను, కఠినంగానూ ఉండాలనీ నేను వేడుకుంటున్నాను. __చదువరి (చర్చరచనలు) 13:20, 21 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు చాలా వివరంగా విశదీకరించారు. తప్పు చేసాను గానీ అది తప్పేమీ కాదులే అని సమర్థించుకోవటం ఎంతవరకు సబబు అని నాఅబిప్రాయం.కని పారేస్తే దేవుడే చూసుకుంటాడు అన్నట్లుగా ఉండకూడదు.ఏదో ఒకటి రాసిపడేస్తే ఎవరో ఒకరు చూసుకుంటారలే అనే అభిప్రాయం గౌరవ వికీపీడియన్లుకు ఎవ్వరికీ ఉండకూడదు.Kasyap గారిలాంటి సుదీర్ఘ అనుభవంగల గౌరవ వికీపీడియన్లుకు అసలు ఈ అభిప్రాయం రాకూడదని కోరుకుంటున్నాను.--యర్రా రామారావు (చర్చ) 06:42, 22 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పనికిమాలిన దోషపు భాషతో కూడిన వ్యాసాలను చాలాకాలం నుండి చూస్తున్నాం. గూగుల్ శోధనలో ఈ వ్యాసాలను చూసేవారు ఈ దోషపు వాక్యాలనే ప్రామాణికంగా తీసుకొనే అవకాశం ఉంది. ఈ కృతక భాష వ్యాసాలు ఎవరికీ ఉపయోగపడవు. ఈ గూగుల్ అనువాద వరికరం చాలా కృతకంగా, దోషభూయిష్టమైన భాషతో అనువాదాలను చేస్తుంది. భాష రాని వాడుకరులు కూడా ఒక నిమిషంలో అనువాదం చేస్తున్నారు. తరువాత దానిని శుద్ధిచేయడానికి పట్టించుకోరు. ఈ మధ్య రసాయన శాస్త్ర వ్యాసం గూగుల్ అనువాదం చేసినపుడు అది అనువాదం చేసే భాష చాలా దోషాలతో అర్థం పూర్తిగా మార్చి చూపిస్తుంది. "basic solutions" అనగా "క్షార ద్రావణాలు". గూగుల్ పరికరం "ఆధారపు పరిష్కారాలు" అని అనువాదం చేస్తుంది. భాష, రాసే వ్యాసంలోని అంశాల గూర్చి అవగాహన లేకపోతే అదే సరైన అనువాదం అని వదిలేస్తారు. అందువలన భాష విషయంలో రాజీపడడం ఉండరాదు. కనుక ఇటువంటి పనికిమాలిన భాషతో కూడిన వ్యాసాలను తక్షణం తొలగించాలి. అందులో వికీలో ఉండవలసిన వ్యాసాలుండవచ్చు. వాటిని జాబితాగా తయారుచేస్తే ఎవరైనా ఎర్రలింకులనుపయోగించి మంచి వ్యాసాలు మొదలుపెడతారు.--కె.వెంకటరమణచర్చ 13:16, 22 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వేగిరపడి వాడుకరులు
తెగులును తెలుగునకు చేర్చె, తెవికీనందున్
గూగుల్ అనువాదాలను
పోగులుగా తొలగించుట పరమోత్తమమున్

—కె.వెంకటరమణ

కె.వెంకటరమణ గారూ, మీరు చెప్పిన ఈ ఉదాహరణ ఒక్కటి చాలు.. ఈ అనువాదాలు ఎంత హీనంగా ఉంటాయో తెలిసి పోడానికి.
Rajasekhar1961 గారు, రవిచంద్ర గారు తమ మద్దతు ఇవ్వడంతో చాలా సంతోషం కలిగింది. వెంకటరమణ గారు నిర్ద్వంద్వంగా తేల్చిచెప్పడంతో అది ద్విగుణీకృతమైంది. ఈ సంతోషంలో నా వంతుగా కూడా ఒక పద్యం:
ఢంకా మోగించి మరీ

వెంకట రమణయ్య గారు వివరించిరిగా

ఇంకెందుకు ఆలస్యము

పంకంబును కడిగివేసి ప్రక్షాళింపన్

—చదువరి

ఈ వ్యాఖ్యలు, ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులు గమనించాకా మరొక్క సంగతి గుర్తుచేయదలిచాను. గూగుల్‌ అనువాద సహకారంతో వికీపీడియా అనువాద ఉపకరణం వాడి నిమిషాల వ్యవధిలో ఒక్కో కృతక అనువాద వ్యాసాన్ని ప్రచురించగలిగే వీలు ఏర్పడింది. తెలుగు వికీపీడియానే కదా చకచకా అనువాదాలు చేసి పారేయవచ్చన్న ధోరణితో వచ్చే కొత్తవారు మనకు నిరుపయోగం, పైపెచ్చు ప్రమాదకరం. "కొద్ది పాటి కృతకత్వం పర్వాలేదులే" అన్న దృక్పథం మనకెలాగూ పనికిరాదన్నది సుస్పష్టమే. అంతకుమించి పరిస్థితులు మదింపు వేసుకుని, భవిష్యత్తులో అలాంటి వ్యాసాల వరద రాకుండా, ఒకవేళ ఎవరైనా వాడుకరి వరుసగా కృత్రిమ అనువాద వ్యాసాలు రూపొందిస్తూ ఉంటే ఏం చర్యలు చేపట్టాలి అన్నదానిపై ప్రత్యేకమైన పాలసీ అవసరం. అందుకు వేరే పాలసీ ఏర్పాటుచేసుకునేలా చర్చలు చేపట్టాలని ఆశిస్తున్నాను. ఇక చదువరి గారు లేవనెత్తిన ఐఐఐటీ వారి ప్రయత్నం, దాని నేపథ్యంలో ఈ వ్యాఖ్య పరిశీలిస్తే ఒక్క సంగతి మళ్ళీ నొక్కివక్కాణించదలిచాను, తెలుగు వికీపీడియాలో పనిచేసే బయటి సంస్థలు, తెలుగు వికీపీడియాతో కలిసి పనిచేసే బయటి సంస్థలు అనుసరించవలసిన పద్ధతులు ఇప్పటికే సీఐఎస్-ఎ2కె వంటి సంస్థలతో కలిసి పనిచేసినప్పుడు కొంతమేరకు ఏర్పడ్డాయి. అవేమీ స్ఫుటంగా రాసివుండకపోవడం మంచి విషయం కాదు, కాబట్టి సముదాయం ఈ అంశాన్ని పునరాలోచించి మార్గదర్శకాలు ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉంది. --పవన్ సంతోష్ (చర్చ) 09:14, 23 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, దీనిపై ఒక విధానం చేసుకోవాలని మీరు సరిగ్గా చెప్పారు. ఈ విధానానికి మీరు రూపకల్పన చెయ్యాలని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 06:55, 24 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ చర్చలోగాని, వోటింగులో గానీ కలగజేసుకోని వాడుకరులెవరైనా.. నిర్ణయాన్ని ప్రకటించవలసినది. __చదువరి (చర్చరచనలు) 13:15, 25 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం

తెవికీ నాణ్యత - యాంత్రికానువాద వ్యాసాల సమస్యపై జరిగిన చర్చలో పాల్గొన్న సముదాయ సభ్యులకు ధన్యవాదాలు. ఎక్కువమంది సభ్యులు యాంత్రికానువాద వ్యాసాల తొలగింపుకు మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ దీనిపై చర్చ ముగిసినట్టుగా ప్రకటించడమైనది. యాంత్రికానువాద వ్యాసాలను మరో వారం రోజుల తరువాత తొలగించబోతున్నాం. అయితే వాటిల్లో ఎక్కువ వీక్షణలు పొంది, చదువరులకు అవసరమైన వ్యాసాలు ఉన్నాయి. కాబట్టి, సముదాయ సభ్యుల్లో ఎవరైనా ఆయా వ్యాసాలను మరలా సృష్టించి, వాటిని రాయవచ్చు. ఆ వ్యాసాల జాబితాకోసం ఇప్పటికే చదువరి గారు వికీపీడియా:గూగుల్ యాంత్రిక అనువాద వ్యాసాల జాబితా - 2020 జనవరి 19 పేజిని పెట్టారు. ఆయా వ్యాసాలపై పని చెయ్యదలచిన వారు 2020, ఫిబ్రవరి 4వ తేది లోపు సంబంధిత స్థానంలో తమతమ పేరును చేర్చగలరు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:13, 28 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Wiki Loves Women South Asia 2020[మార్చు]

Wiki Loves Women is back with the 2020 edition. Join us to celebrate women and queer community in Folklore theme and enrich Wikipedia with the local culture of your region. Happening from 1 February-31 March, Wiki Loves Women South Asia welcomes the articles created on folk culture and gender. The theme of the contest includes, but is not limited to, women and queer personalities in folklore, folk culture (folk artists, folk dancers, folk singers, folk musicians, folk game athletes, women in mythology, women warriors in folklores, witches and witch hunting, fairytales and more). You can learn more about the scope and the prizes at the project page.

Best wishes,

Wiki Loves Women Team

--MediaWiki message delivery (చర్చ) 09:52, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Wikimedia 2030: Movement Strategy Community conversations are here![మార్చు]

Dear Affiliate Representatives and community members,

The launch of our final round of community conversation is finally here! We are excited to have the opportunity to invite you to take part. 
The recommendations have been published! Please take time over the next five weeks to review and help us understand how your organization and community would be impacted.

What Does This Mean?

The core recommendations document has now been published on Meta in Arabic, English, French, German, Hindi, Portuguese, and Spanish. This is the result of more than a year of dedicated work by our working groups, and we are pleased to share the evolution of their work for your final consideration. 
In addition to the recommendations text, you can read through key documents such as Principles, Process, and the Writer’s Reflections, which lend important context to this work and highlight the ways that the recommendations are conceptually interlinked.
We also have a brief Narrative of Change [5] which offers a summary introduction to the recommendations material. 

How Is My Input Reflected In This Work?

Community input played an important role in the drafting of these recommendations. The core recommendations document reflects this and cites community input throughout in footnotes. I also encourage you to take a look at our community input summaries. These texts show a further analysis of how all of the ideas you shared last year through online conversations, affiliate meetings, and strategy salons connect to recommendations. Many of the community notes and reports not footnoted in the core recommendations document are referenced here as evidence of the incredible convergence of ideas that have brought us this far.  

What Happens Now?

Affiliates, online communities, and other stakeholders have the next five weeks to discuss and share feedback on these recommendations. In particular, we’re hoping to better understand how you think they would impact our movement - what benefits and opportunities do you foresee for your affiliate, and why? What challenges or barriers would they pose for you? Your input at this stage is vital, and we’d like to warmly invite you to participate in this final discussion period.

We encourage volunteer discussion co-ordinators for facilitating these discussions in your local language community on-wiki, on social media, informal or formal meet ups, on-hangouts, IRC or the village pump of your project. Please collect a report from these channels or conversations and connect with me directly so that I can be sure your input is collected and used. Alternatively, you can also post the feedback on the meta talk pages of the respective recommendations.

After this five week period, the Core Team will publish a summary report of input from across affiliates, online communities, and other stakeholders for public review before the recommendations are finalized. You can view our updated timeline here as well as an updated FAQ section that addresses topics like the goal of this current period, the various components of the draft recommendations, and what’s next in more detail. 
Thank you again for taking the time to join us in community conversations, and we look forward to receiving your input. (Please help us by translating this message into your local language). Happy reading! RSharma (WMF) MediaWiki message delivery (చర్చ) 21:31, 20 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Train-the-Trainer 2020 Application open[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

ట్వింకిల్ మెనూ దోషాలు పరిష్కరించబడినవి.[మార్చు]

https://meta.wikimedia.org/w/index.php?title=Indic-TechCom%2FRequests&type=revision&diff=19736644&oldid=19729281 లో తెలిపినట్లు సవరణలు చేసి TW రెండు సార్లు కనబడటం, దాని ఆదేశాలు బుల్లెట్ తో రావటం పరిష్కరించాను. User:Jayprakash12345 సహాయానికి కృతజ్ఞతలు. --అర్జున (చర్చ) 04:06, 22 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తేడా గమనించాం. అర్జున Jayprakash గార్లకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 09:26, 22 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Movement Learning and Leadership Development Project[మార్చు]

Hello

The Wikimedia Foundation’s Community Development team is seeking to learn more about the way volunteers learn and develop into the many different roles that exist in the movement. Our goal is to build a movement informed framework that provides shared clarity and outlines accessible pathways on how to grow and develop skills within the movement. To this end, we are looking to speak with you, our community to learn about your journey as a Wikimedia volunteer. Whether you joined yesterday or have been here from the very start, we want to hear about the many ways volunteers join and contribute to our movement.

To learn more about the project, please visit the Meta page. If you are interested in participating in the project, please complete this simple Google form. Although we may not be able to speak to everyone who expresses interest, we encourage you to complete this short form if you are interested in participating!

-- LMiranda (WMF) (talk) 19:01, 22 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

విజువల్ ఎడిటరుతో దిద్దుబాటు చేసేటపుడు[మార్చు]

గమనిక: విజువల్ ఎడిటరుతో దిద్దుబాటు చేసేటపుడు మాత్రమే

విజువల్ ఎడిటరుతో దిద్దుబాటు చేసేటపుడు, ఏదైనా లింకుపై నొక్కితే, కింద ఒక చిన్న పెట్టె తెరుచుకుంటుంది. అందులో ఆ లింకు ఏ పేజీకి లింకై ఉందో (గమ్యం పేజీ) చూపిస్తుంది. దాని కిందనే చిన్నపాటి వివరణ ఉంటుంది. బొమ్మ-1 చూడండి. ఈ వివరణ వికీడేటా నుండి వస్తుంది. గమ్యం పేజీకి సంబంధించిన వికీడేటా అంశం లోని వివరణను ఇక్కడికి తెచ్చి చూపిస్తుంది. వికీడేటా పేజీలో వివరణ ఏమీ లేకపోతే ఇక్కడ ఏమీ చూపించదు, రెండవ బొమ్మలో లాగా. కొన్ని సందర్భాల్లో అక్కడ వివరణ సరిగ్గా ఉండకపోవచ్చు, మూడవ బొమ్మలో లాగా. వీటిని బట్టి మనం వికీడేటా లోని ఆ అంశానికి వెళ్ళి వివరణ రాయవచ్చు/సరిదిద్దవచ్చు. వికీడేటా పేజీకి వెళ్ళాలంటే గమ్యంపేజీలో నేవిగేషను పట్టిలో ఉన్న "వికీడేటా అంశం" అనే లింకు నొక్కితే చాలు.

బొమ్మ-1
బొమ్మ-2
బొమ్మ-3
నేను ఇంగ్లీష్ వికీపీడియా వ్యాసాలను అనువదించి తెలుగు వికీపీడియాలో రాస్తున్న క్రమంలో వికీడేటాలో ఆయా వివరణలను రాస్తున్నాను. ఇలా వికీడేటాలో పొందుపరచడంవల్ల అన్ని భాషల వికీమీడియా ప్రాజెక్టుల కోసం ఇది జ్ఞాన భాండాగారంగా సహాయపడుతుంది. దీని ఉపయోగాన్ని తెలియజేసిన చదువరి గారికి ధన్యవాదాలు. Pranayraj Vangari (Talk2Me|Contribs) 08:29, 23 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యాంత్రికానువాదాలపై చర్చలు[మార్చు]

రెండు సంగతులు:

  1. గూగుల్ యాంత్రికానువాద పరికరం వాడి సృష్టించిన పేజీలపై ఇప్పటిదాకా చాలానే చర్చలు జరిగాయి. ఇవన్నీ కూడా రచ్చబండలోనే జరిగాయి. అయా సందర్భాఅల్లో జరిగిన చర్చలు ఒక్కోదానికి ఒక్కో పేజీని సృష్టించాను. భవిష్యత్తులో మనం చేసుకోబోయే విధాన నిర్ణయానికి ఈ పేజీలు దోహదం చెయ్యగలవు. కొత్తగా సృష్టించిన ఈ పేజీలన్నిటినీ "యాంత్రికానువాదం ద్వారా చేర్చిన వ్యాసాలపై జరిగిన చర్చలు" అనే శీర్షం కింద ఉంచుతూ ఒక మూసను తయారు చేసాను. మొదటి చర్చతో మొదలుపెట్టి అన్ని చర్చలనూ పరిశీలించవచ్చు.
  2. మనం తొలగించ తలపెట్టిన గూగుల్ యాంత్రికానువాద వ్యాసాల జాబితాను ఒక పేజీలో ఉంచాలని స్వరలాసిక గారు అడిగాక, ఆ పేజీని తయారు చేసి, పైన లింకు ఇచ్చి ఉన్నాను. కొందరు వాడుకరులు ఆ లింకును గమనించలేదని గమనించాను. అందుకే ఆ జాబితా పేజీ లింకును మళ్ళీ ఇస్తున్నాను. పరిశీలించండి.

__చదువరి (చర్చరచనలు) 07:43, 26 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Improving the translation support for Telugu[మార్చు]

Content translation has been successful in supporting the translation process on many Wikipedia communities, and we want to help additional wikis with potential to grow using translation as part of a new initiative.

Content translation facilitates the creation of Wikipedia articles by translating content from other languages. It has been used already to create more than half a million articles. In addition, the tool provides mechanisms to encourage the creation of good quality content, preventing the publication of lightly edited machine translations. In general, our analysis shows that the translations produced are less likely to be deleted than the articles started from scratch.

Telugu editors have used Content translation to create 417 articles last year. Given the size of the editing community, we think that there is potential to use translation to create more articles, expand existing ones, and attract new editors that learn how to make productive edits. Translation can help the community to reduce the language gap with other languages and grow the number of editors in a sustainable way. In order to achieve this goal, we want to collaborate with you to make Content translation more visible in the Telugu Wikipedia and support new ways to translate.

As a first step, during the next weeks we plan to enable Content translation by default on Telugu Wikipedia. That will make it easy for users to discover the tool through several entry points. However, users not interested in translation will still be able to disable it from their preferences.

Please feel free to share any comment in this conversation thread.

Thanks! --Pginer-WMF (చర్చ) 08:24, 28 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Pginer-WMF, thanks for bringing up this issue for discussion. My personal experience (after translating 180+ articles) with the tool has been both good and bad. The good ones are:
1. It is fast.
2. its integration with Wikipedia
And, there is one bad one, but the most important one - POOR quality. The machine translations (English to Telugu) churned out from the tool have been of very poor quality. (But such issues with automatic tools are not uncommon. A little human intervention will improve the quality.) Tewiki community has been mulling over the issue and just decided to delete en-masse, all the machine translated articles (1770 articles) done a few years ago. And the recent translations have been put under tight scrutiny.
The current publishing restrictions with respect to the number of or %ge of mandatory manual edits is not working for Telugu. Lets consider the following two points, as illustration:
  1. The "Passive voice", which is natural for English, is not natural for Telugu. We use only "Active voice"; Not that it is totally non-existent, its use is very very very rare.
  2. Usage of certain words like "and" is not natural for Telugu -either obsolete, or never really used.
The machine translation tool violates both the above rules in every other sentence. Many editors are simply too unconcerned to improve the quality, because it takes quite a bot of editing.
Now, my recos to improve the situation (The ultimate improvement, of course, is the improvement of the machine output):
  1. Introduce publishing restrictions based on the language -words/phrases etc., besides the current, number of manual edits.
  2. Provide an interface for some Editors to introduce/edit/remove the restrictions, customised to every Wiki.
__చదువరి (చర్చరచనలు) 00:52, 29 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Thanks for your detailed and constructive feedback, చదువరి. Based on this, here are some ideas on what can be improved to make Content Translation work better for Telugu:
Define Telugu-specific filers. When an article is published with Content translation, the usual edit filters are applied in the same way as with any other new article. Communities can define their own edit filters to prevent the publication or show warnings when the content contains certain words. That could be a useful way to introduce/edit/remove restrictions for new articles created with Content translation (i.e., those with a "contenttranslation" edit tag) or those created with any other tool.
Adjust the limits for Telugu. We can adjust the tool to prevent publishing a translation when it contains more than X% of unmodified Machine Translation, but we need to identify such value in collaboration with native speakers of the language. We need to know which is the percentage for modifications that is absolutely needed when translating into Telugu. Based on your experience, do you have any suggestion? It would be useful if you could share a few examples of both good quality and bad quality articles so that we can inspect them with the translation debugger to check how much the original translation was modified. This is an iterative process so we can do an initial adjustment and observe the effect in article quality and deletion ratios.
Change the default service. Currently the default translation service is Google Translate. Yandex translate is also available for Telugu. If Yandex provides better results, we can make it the default. We are also exploring the possibility of providing experimental support for OpusMT which is an open source neural machine translation system based on MarianMT and the Open paralell corpus project. Enabling it is expected to produce very low quality results, but with more data from the translations corrected and published by the users, the system will learn and make better translations based on the community input.
Please, let me know if any of the above areas seems interesting for adjustment or any other questions you may have.
Thanks --Pginer-WMF (చర్చ) 13:04, 29 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Pginer-WMF, Thanks for your response.
Filters: Okay, We will implement appropriate filters after community consensus. (But an integrated filter in the tool is more preferred.)
Limits: The analysis tool is very useful. Thanks for the link. You can check the following articles, all translated by me, most of them in Dec 2019:
  1. Human evolution, Australopithecus, Australopithecus africanus, Australopithecus afarensis, Australopithecus anamensis, Homo ergaster, Homo, Homo habilis, Sahelanthropus, Australopithecus garhi, Old World, New World, Miocene, Holocene, Pleistocene, Holocene, Pliocene - Mostly all these are Science articles.
  2. United Nations Security Council Resolution 39, United Nations Security Council Resolution 47 -Non-science articles.
The analysis tool shows that almost 50% of the translation content is manual edits in these articles. I will put this finding to community discussion and get back to you with suggested limits after taking the community opinion. It might take a week.
Default service: Yandex auto translation is very poor. Google is superior to it. No change required here.
One more issue: Not sure if this is the right place for it.. Repeated publishing of the same article from the translation tool is causing some issues. Any edits done to the article are lost as soon the article is republished. Some users are doing repeat publishing, oblivious to the fact that the article is edited by other users. Can this be restricted?
Thanks. __చదువరి (చర్చరచనలు) 04:28, 30 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి thanks! This is very useful feedback. Please let us know of further feedback from those community discussion.
Regarding the problems with Repeated publishing, that may improve with some of the work we plan to do next. As part of the Translation Boost initiative, we are working to support users to expand existing articles by translating new sections. This means that after publishing a translation, users no longer have to overwrite the whole article with a new translation (which increases the chances of overwrite changes by other editors that happened meanwhile). Instead, users can translate a section that will expand the existing contents. We are still at the early stages of the project, doing the design and user research work, so it may still take some time until it is available in the tool. --Pginer-WMF (చర్చ) 16:43, 30 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Hello everyone. We have enabled Content translation by default on Telugu Wikipedia this week.
Now it is easy for users to discover the tool through several entry points. However, users not interested in translation can disable it from their preferences.
We expect this will help translators to create more content of good quality in Telugu. We’ll be monitoring the statistics for Telugu as well as the list of articles created with the tool. Content translation provides quality control mechanisms to prevent the abuse of machine translation and the limits can be adjusted based on the needs of each community. Please, feel free to continue sharing your impressions about the content created and how the tool works for the community. This feedback is essential to improve the tool to better support your needs.
Thanks! --Pginer-WMF (చర్చ) 12:34, 6 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Pginer-WMF, with regard to the manual translation content can you please set the minimum manual translation requirement to 40%. Thank you. _చదువరి (చర్చరచనలు) 07:51, 9 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Thanks, చదువరి! That percentage is a useful reference, and I created a ticket to start the process based on it. Since this adjustment is applied to all kinds of articles and prevents users from publishing, we start with some flexibility (e.g., forcing users to modify 30% of the contents, even if 40% is the reference), in order to observe the initial results and adjust further if needed. I've shared more details (including deletion stats) in the ticket and I'll provide updated info once we apply the initial changes. Thanks for your helping with this process!--Pginer-WMF (చర్చ) 18:11, 10 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Pginer-WMF, Great. Enforcement at 30% is a good idea, I appreciate it. Thanks for your help. __చదువరి (చర్చరచనలు) 01:07, 11 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
The change in the limits should be effective as of now. Please let us know how that is working, and whether further adjustments may be needed. Thanks! --Pginer-WMF (చర్చ) 12:59, 24 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Okay Pginer-WMF, will get back to you with my feedback. __చదువరి (చర్చరచనలు) 00:55, 25 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Pginer-WMF, it is working. I tried it on "Industrialisation". At 70% machine translation, it refused to publish and shown a message to that effect. At 68%, it published. Thank you. __చదువరి (చర్చరచనలు) 02:46, 25 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ - విధానంపై చర్చ[మార్చు]

యాంత్రికానువాదాలలో దోషాల నియంత్రణ కోసం సముదాయం ఉద్యమించాల్సి ఉంది. దీని గురించి పైన జరిగిన చర్చను పరిశీలించండి. ఈ చర్చ కంటే ముందే ఈ సమస్య పట్ల మనందరం మల్లగుల్లాలు పడుతూ ఉన్నాం. అదే సమయంలో ఈ చర్చ రావడం సందర్భోచితం గాను, శుభ సూచకంగానూ ఉంది. దీనిపై మనం ఒక విధానం లేదా మార్గదర్శకాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని భావించి అందుకోసం వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ అనే విధాన నిర్ణాయక పేజీని సృష్టించాను. వాడుకరులంతా దాన్ని పరిశీలించి, తగు మార్పుచేర్పులు చేసి, సూచనలు చేసి విధాన నిర్ణయంలో పాలు పంచుకుని తెవికీ నాణ్యతాభివృద్ధికి దోహదపడాలని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 07:33, 30 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అవును... ఒక్క క్లిక్ తో పని ఆయిపోగొట్టి, మళ్ళీ ఆ వ్యాసంవైపు చూడడంలేదు. కాబట్టి, యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ - విధానంపై చర్చ జరిగి యాంత్రికనువాద వ్యాసాల తాకిడిని తగ్గించాలని నా అభిప్రాయం. Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:02, 2 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మా ఊరి చరిత్ర - పోలుమళ్ళ[మార్చు]

త్వరలో ....

చూద్దాం. గతంలో కొందరు అది చేస్తాం, ఇది చేస్తాం, చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళారు. మళ్ళీ రానే లేదు. ఇంకా చూస్తూనే ఉన్నాం. మీరేం చేస్తారో మరి! ఇదేనా మీ ఊరు? పేరు తప్పు పడిందా? __చదువరి (చర్చరచనలు) 01:31, 31 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]